`సినీ కార్మికుల సంఘాల అనుమానం?
`46 మంది ఇచ్చిన దాని కోసం ఆశపడ్డారా?
`హై కోర్టులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు!
`నలుగురు కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణమేమిటి!
`ఏ ఒక్కరు కౌంటర్ దాఖలు చేసినా నిన్న ఫైల్ బెంచ్ పైకి వచ్చేది!
`మూకుమ్మడిగా తప్పుకొని కౌంటర్ దాఖలు చేయలేదా?
`రో హౌస్‌ల ఫైల్ బెంచ్ మీదకు రాకుండా చేశారా?
`ఎంత కాలం తప్పించుకుంటారు!
`కోర్టు ను కూడా మోసం చేయడం అలవాటు చేసుకున్నారు!
`అదనపు నిర్మాణాలపై సమాధానానికి గడువెందుకు?
`రో హౌస్ ల నిర్మాణమే అక్రమం!
`1500 ఎస్‌ఎఫ్టీ దాటి 2250 ఎస్‌ఎఫ్టీ నిర్మాణం నేరం.
`మళ్ళీ అదనపు నిర్మాణాలు చట్ట విరుద్దం.
`ఇన్ని రకాల ఉల్లంఘనలు ఎందుకు కనిపించడం లేదు!
`ఎన్నటికైనా రో హౌస్ లు కూల్చాల్సిందే!
`మున్సిపల్ ప్రిన్స్‌పల్ సెక్రెటరీ కార్యాలయం నుంచి కౌంటర్ చేరలేదు!
`హెచ్‌ఎండిఏ స్పందన లేదు.
`మణికొండ మున్సిపాలిటీ పట్టించుకోలేదు.
`చిత్రపురి సొసైటీ కూడా కదలలేదు!
`మతలబ్ క్యా హై అంటున్నారు కార్మికులు!
`ఆ నలుగురు చేసింది కోర్టు ఉల్లంఘన కాదా!
`రో హౌస్ లు కూల్చాలని రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్.
`జరిగిన ఉల్లంఘనలపై నోరు మెదపని సినీ పెద్దలు.
`కార్మికుల నుంచి సొమ్ము వసూలు చేశారు.
`14 ఎకరాలు అప్పనంగా ఇతరులకు దోచిపెట్టారు.
`అక్రమంగా 225 రో హౌస్ లు నిర్మాణం చేశారు.
`కేవలం 6 రో హౌస్ లకు నోటీసులిచ్చారు!
`నాలుగు కూల్చి చేతులు దులుపున్నారు.
`బహిరంగంగా ఇంతగా అక్రమాలు సాగిస్తున్నారు.
`సినిమా కు సంబంధమే లేని వాళ్లకు రో హౌస్ లు ఎలా ఇచ్చారు.
`అప్పార్టుమెంట్లు కట్టాల్సిన చోట రో హౌస్ లు ఎవరి కోసం కట్టారు!
`కార్మికులను వంచించి కాలం గడుపుతున్నారు.
`చిత్రపురిని ఏటిఎం చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు.
వాటాలు వేసుకొని మరీ జీవితకాలం సంపాదనగా మార్చుకున్నారు.
`రోహౌస్‌లు కూల్చి…ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి!
`సినీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త!
`ప్రజా ప్రభుత్వం విజయోత్సవాలలో భాగంగా ప్రభుత్వం ప్రకటన?
`ఎన్నికల సమయంలో సిఎం.రేవంత్ హామీ అమలు దిశగా.
`అతి త్వరలో కార్మికులకు తీపికబురు.
`కార్మికుల పక్షాన ఏళ్ల తరబడి నేటిధాత్రి అక్షరపోరాటం.
`రో హౌస్ ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తేనే కార్మికులకు న్యాయం!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏ ముహూర్తాన చిత్రపురి నిర్మాణం గురించి ఒకప్పటి సినీ పెద్దలు తలిచారో గాని, ఇలా జరుగుతుందని మాత్రం వాళ్లు ఊహించి వుండరు. ఒక గొప్ప చరిత్రకు మార్గం వేసి, కొన్ని వేల కుటుంబాలకు ఆశ్రయం కల్పించాలని, వారి భవిష్యత్తుకు తర్వాత తరాలకు కూడా నీడ, గూడు కల్పించాలని సంకల్పించారు. కానీ వారి కల పూర్తిగా నెరవేరకుండా చేసే వారు వస్తారని కలలో కూడా ఊహించివుండరు. సరే ఒక్కోసారి ఒక గొప్ప సంకల్పం జరిగినప్పుడు చిన్న చిన్న తప్పులు దొర్లినా పెద్దగా నష్టం వాటిల్లకపోవచ్చు అని తలచి వుంటారు. తప్పులే ఎక్కువగా జరిగి మేలు మాత్రం పిడికెడు జరుగుతుంతని, తమ సంకల్పానికి తూట్లు పొడిచేవారు వస్తారని అనుకోకపోవచ్చు. ఆ మహానుభావులే మళ్ళీ తిరిగి వస్తే, నిజంగా చిత్రపురి కార్మికులతో కళకళలాడాలని తలంచిన వారి ఆత్మలు ఘోషిస్తుంటాయి. అంతగా చిత్రపురిలో దుర్మార్గం తాండవిస్తోంది. అక్రమాలు ఆధిపత్యాలు సాగిస్తున్నాయి. అన్యాయాలు రాజ్యమేలుతున్నాయి. అయిన వారికి, అనుయాయులకు, అస్మదీయులకు చిత్రపురి ఫ్లాట్స్ కట్టబెట్టి అసలైన కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు. చిత్రపురి కాలనీకి అర్థం లేకుండా చేస్తున్నారు. చిత్రపురిలో ఎంత మంది చిత్రపరిశ్రమ కార్మికులున్నారని లెక్క తీస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సింది. అంతస్తుకొక్కరు కూడా వున్నారో లేరో చెప్పలేం. ఇక రో హౌస్ ల విషయానికి వస్తే అది మరీ దుర్మార్గం. ఆ నలుగురు కుమ్మక్కయ్యారా! అని సినీ కార్మికుల సంఘాల అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రో హౌస్ లు దక్కించుకున్న వారిలో సినీ రంగానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు సొంతం చేసుకున్న ఆ 46 మంది ఇచ్చిన దాని కోసం ఆశపడ్డారా? అన్న ప్రశ్నలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నిన్నటి రోజు రో హౌస్ లపై కోర్టుకు సమర్పించాల్సిన అఫిడవిట్లు ప్రభుత్వం తరుపున అటు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, హెచ్‌ఎండిఏ, మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ , చిత్రపురి హౌసింగ్ సొసైటీ హై కోర్టులో కౌంటర్లు దాఖలు చేయలేదు. నలుగురికి నలుగురు కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణమేమిటి? ఏ ఒక్కరు కౌంటర్ దాఖలు చేసినా నిన్న ఫైల్ బెంచ్ పైకి వచ్చేది! అయినా ఒక్కరు కూడా కౌంటర్ దాఖలు చేయలేదంటే అర్థమేమిటి? మూకుమ్మడిగా తప్పుకొని కౌంటర్ దాఖలు చేయలేదా? అన్న అనుమానం రాకుండా వుంటుందా? అదే నిజం కాకుండా పోతుందా? అందరూ కలిసి రో హౌస్‌ల ఫైల్ బెంచ్ మీదకు రాకుండా చేశారు! కానీ ఎంత కాలం తప్పించుకుంటారు! ఎప్పటికైనా కౌంటర్ దాఖలు చేయకతప్పదు. అప్పుడు వారి బండారం బైట పడక మానదు. మోసం తేటతెల్లం కాక తప్పదు. కోర్ట్ ను కూడా మోసం చేయడం ఎల్ల కాలం సాగదు.
రో హౌస్ ల నిర్మాణమే అక్రమం! అక్రమం కార్మికులు కంఠనాళాలు తెగిపోయేలా అరిచారు. దర్నాలు చేశారు. నిరసనలు చేపట్టారు. నిరాహారదీక్షలు చేశారు. అయినా సినీ మాయగాళ్ల మనసులు కరగలేదు. కార్మికుల మీద ప్రేమ కలగలేదు. వారి భూమి వారికే చెందాలన్న సోయి రాలేదు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు దూరారు. అలాంటి పాములను తరిమేయడానికి కార్మికులు చలి చీమలు కాలేకపోయారు. ఎందుకంటే కార్మికులు అమాయకులు. అభాగ్యులు. నిర్భాగ్యులు. నోరున్నా ప్రశ్నించలేని వాళ్లు. అన్యాయం జరిగినా తిరగబడలేని వాళ్లు. కార్మికులు అసహాయులు కావడం వల్లనే సినీ గద్దల ఆటలు సాగుతున్నాయి. వారి దుర్మార్గాలే చెల్లుతున్నాయి. తెర మీద కనిపించాలని కొందరు…సినిమాలో భాగమైతే చాలని కొందరు, రంగుల లోకాన్ని ఆకాశంలో హరివిల్లులా ఊహించుకొని వచ్చే వాళ్లే ఎక్కువ మంది. అలాంటి వారికి ఆ సినిమా ప్రపంచమే లోకం. అందువల్ల సినిమా పేరుమీద కూలి దొరికినా చాలు. సమయానికి నాలుగు మెతుకులు అందినా చాలు అని సినిమాను నమ్ముకునే వెర్రిబాగులోల్లు. వారి బలహీనతలను ఆసరా చేసుకొని కార్మికులను వంచిస్తున్నారు. కార్మికుల కోసం కేటాయించిన భూమిలో రెండు ఎకరాల అప్పనంగా ఆక్రమించుకొని రో హౌస్ లు కట్టుకున్నారు. పనిలో పనిగా దానిని రియల్ వ్యాపారంగా మార్చుకున్నారు. కార్మికుల కడుపు కొట్టారు. కార్మికులు తలదాచుకోవాల్సిన చోట సినీ గద్దలు విలాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా వుంటే అక్రమమైన అనుమతులను దొడ్డి దారిన తెచ్చుకొని 1500 ఎస్‌ఎఫ్టీ దాటి 2250 ఎస్‌ఎఫ్టీ నిర్మాణాలు సాగించారు. వారి కక్కుర్తి బుద్ధి ఇలా కూడా ప్రదర్శించారు. ఆకులు నాకే వారి మూతులు నాకడంలో మా కంటే గొప్ప వాళ్లు మరొకరు వుండరని నిరూపించుకున్నారు. ఎంగిలి మెతుకులు తినడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. అంతటితో ఆగలేదు. మరింత స్థలం ఆక్రమించుకొని మాకన్నా మా మానవత్వం లేని నిర్థయులు కూడా మరెక్కడా వుండరని వాళ్లే నిరూపించుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం మరెక్కడా వుండదు. న్యాయం అన్న పదానికి చోటు లేకుండా చేశారు. నైతికత అనే దానిని ఎప్పుడో గాలికి వదిలేశారు. నీతులు సినిమాలలో మాత్రమే చెప్పడానికి అని నిరూపించుకున్నారు. అసలు రో హౌస్ ల నిర్మాణమే అక్రమం. అదనపు నిర్మాణాలు చట్ట విరుద్ధం. ఒక రకంగా నేరం. సినీ గద్దలన్నీ ఒక చోట చేరి ఇన్ని రకాల ఉల్లంఘనలు సాగిస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేసినట్లు? ఎంతకు అమ్ముడుపోయినట్లు? ఇలా ఎన్ని అక్రమ నిర్మాణాలు ఎంత కాలం సాగినా, రో హౌస్ లు కచ్చితంగా కూల్చేసే రోజులు రాకతప్పదు. ఎందుకంటే రో హౌస్ లు కూల్చాలని రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. కొన్ని సంవత్సరాలుగా నేటిధాత్రి చిత్రపురిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల మీద వరుస కథనాలు వదలకుండా ప్రచురిస్తూనే వుంది. చిత్రపురిలో చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి తెలియజేస్తూనే వుంది. చిత్రపురిలో జరుగుతున్న అన్యాయాల మీద సినీ పెద్దలు నోరు మెదపరు. కనీసం కార్మికులకు అన్యాయం జరగొద్దని సూచనలు కూడా చేయరు. కార్మికుల నుంచి సొమ్ము వసూలు చేసి కొనుగోలు చేసిన భూమి మీద సిని పెద్దలు కన్నేయొద్దని చెప్పడానికి కూడా వారికి నోరు రాదు. అప్పనంగా 14 ఎకరాలు అప్పనంగా ఇతరులకు దోచిపెడుతుంటే గుడ్లప్పగించి చూస్తూ వచ్చారు. ఇప్పటికీ నిజం మాట్లాడతారని అనుకోలేం. అప్పార్టుమెంట్లు కట్టాల్సిన చోట రో హౌస్ లు కట్టారు! కార్మికులను వంచించి కాలం గడుపుతున్నారు. చిత్రపురిని ఏటిఎం చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. వాటాలు వేసుకొని మరీ జీవితకాలం సంపాదనగా మార్చుకున్నారు. ఎల్లకాలం ఇలాగే బతకాలని చిత్రపురిలో తరగని రియల్ వ్యాపార సామ్రాజ్యం సృష్టించుకున్నారు. దోపిడీకి చిత్రపురిని కేరాఫ్ అడ్రస్ చేసుకొన్నారు.
రోహౌస్‌లు కూల్చి…ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సినీ కార్మికులకు ఒక శుభ వార్త అందించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల కోరిక మేరకు వారిని కలవడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. జరిగిన అన్యాయం గురించి కార్మికులు వివరించడం జరిగింది. వాటన్నింటినీ ఆ రోజు కూలంకషంగా విన్న రేవంత్ రెడ్డి ఎలాగైనా వారికి న్యాయం జరగాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి తీరాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చిత్రపురి కార్మికుల సమస్యలపై అధ్యయనం చేయించారు. జరిగిన అన్యాయాన్ని ఎలా సవరించాలన్న దానిపై అనేక సమీక్షలు నిర్వహించారు. ఆయా సందర్భాలలో వచ్చిన సూచనల మేరకు కార్మికులకు రో హౌస్ ల స్థానంలోనే తిరిగి న్యాయం చేయాలనుకున్నారు. రో హౌస్ ల నిర్మాణం పూర్తిగా అక్రమం. ఆ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుంది. దానిపై ఎలాంటి తీర్పు వస్తుందో చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం వుంది. ప్రభుత్వం తరుపున కూడా ఆ దిశగానే వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇంకా చిత్రపురిలో ఎన్నెన్ని చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయో అన్నీ ప్రభుత్వం గమనిస్తూనే వుంది. అందుకే త్వరలో కార్మికులకు మంచి శుభవార్త అందే ముహూర్తం త్వరలోనే వున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రభుత్వం విజయోత్సవాలలో భాగంగా ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కార్మికులకు న్యాయం జరగాలన్న దానిని నోటి మాటగా కాకుండా, మ్యానిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారంటే దానిని తప్పిన సందర్భం లేదు. వుండదు. విశ్వసనీయతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుపేరు. అందుకే ఎన్నికల సమయంలో సిఎం.రేవంత్ హామీ అమలు దిశగా త్వరలోనే అడుగులు పడనున్నాయి. అతి త్వరలో కార్మికులకు తీపికబురు అందనున్నది. రో హౌస్ లు కూలిపోయే సమయం చాలా దగ్గర్లోనే వుంది. కార్మికులకు మంచి రోజులు వచ్చే కాలం ముందుంది.