`ప్రతి సారి ఎన్నికలు ఎన్నికలు అంటారు ఏం సాధిస్తున్నారు?
`అధికార పార్టీని రెచ్చగొట్టి బోల్తా పడుతున్నారు?
`పంచాయతీ ఎన్నికలు పెట్టడానికే ప్రభుత్వం ముందు వెనుక ఆలోచించింది?
`జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అదే చేశారు?
`గెలిచేది మేమే అంటూ పగటి కలలు కన్నారు?
`అరునెలల పాటు హడావుడి చేశారు?
`ఏం జరిగింది.. ఎన్నికకు పదిహేను రోజుల్లో వాతావరణం మారిపోయింది?
`సీఎం. రేవంత్ రెడ్డి వేసిన స్కీచ్ ఆరు నెలల బీఆరఎస్ కష్టం గంగలో కలిసింది?
`అయినా సమీక్ష చేసుకోలేదు.. తప్పులు సరిదిద్దుకోలేదు?
`పంచాయతీ ఎన్నికలు మాకే విజయం అని సంకలు గుద్దుకున్నారు?
`మళ్ళీ బొక్క బోర్లా పడ్డారు.. మున్సిపల్ ఎన్నికల్లో నిండా మునిగిపోయారు?
`ఇప్పటికైనా మేలుకోండి… వ్యూహత్మాకంగా అడుగులేయండి?
`ఎన్నికలను కాదు.. ప్రజలను నమ్ముకోండి?
`ఎన్నికలతో బలపడేందుకు ఇది ఉద్యమ కాలం కాదు?
`రాజకీయ కాలం.. రాజకీయమే చేయాలి?
`ఇంకా ఉద్యమం కాలం గురించే చెప్పుకుంటే చాలదు?
`ప్రభుత్వం మీద యుద్ధం చేయకుంటే బీఆరఎస్ ను నమ్మరు?
`మున్సిపల్ ఎన్నికలతోనైనా కళ్ళు తెరవండి?
`కాంగ్రెస్ ను ఒంటి చేత్తో గెలిపిస్తున్న సిఎం రేవంత్ రాజకీయం గమనించండి?
`సమిష్టి రాజకీయ విజయం ఎలా వుంటుందో నేర్చకోండి?
`అందరికీ సమాన అవకాశాలు కల్పించండి?
`ప్రతి దగ్గర మేమే ఉండాలనుకోవద్దు?
`జిల్లా రాజకీయాలలో నేతలకు స్వేచ్ఛ నివ్వండి?
`నాయకుల మధ్య సమన్వయం జరిగేలా చూడండి?
`ఆరు గ్యారెంటీ ల మీద పోరాటం చేయండి?
`ప్రజలు సీఎం. రేవంత్ పాలనలో అసంతృప్తి గా లేరు?
`జనం లో వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ కు ఇన్ని విజయాలు దక్కవు?
హైదరాబాద్, నేటిధాత్రి:
మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. రాజకీయ పార్టీలు ఏం నేర్చుకున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఏం పాఠాలు నేర్పాయి. పాలకపక్షం ఏం నేర్చుకున్నది. ప్రతిపక్షం ఏం తెలుసుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ప్రతిపక్ష బిఆరఎస్ ఊహించిన లేదన్నది మాత్రం తేలిపోయింది. పైగా ప్రతిపక్షం మాట ప్రజా క్షేత్రంలో చెల్లలేదన్నది రుజువైంది. బిఆరఎస్ ఒప్ప్పుకున్నా, ఒప్ప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ మీదనే జనంలో నమ్మకం కనిపించింది. ప్రతిపక్షాల మీద నమ్మకం సన్నగిల్లింది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ గెలుపు ఏం చూచిస్తోంది అనేది బిఆరఎస్ తెలుసుకోవాలి. ప్రజా ప్రభుత్వం మీద మరింత నమ్మకం ఎందుకు మరింత పెరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదికారంలో వుండడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందనే సొల్లు మాటలు బిఆరఎస్ మర్చిపోవాలి. బిఆరఎస్ ఇంత ప్రచారం చేసినా సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వం మీద ఎందుకంత విశ్వాసం పెరిగిందనేది కూడా అధ్యయనం చేయాలి. సిఎం. రేవంత్ రెడ్డి వేస్తున్న వ్యూహాల ముందు బిఆరఎస్ తేలిపోతోందా? అందుకే ప్రజా తీర్పులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయా? లాటరీలు కూడా జనగాం, తొర్రూర్‌లలో కాంగ్రెస్‌ను విజయం వరించడం బిఆరఎస్‌కు దెబ్బ మీద దెబ్బ పడడమే అయ్యింది. గాయిగాయి చేసిన బిఆరఎస్ ఆశలపై కాలం నీళ్లు చల్లినట్లైంది. బిఆరఎస్ నాయకులు మీడియా పులులే అని మరోసారి రుజువైంది. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సిఎం. రేవంత్‌రెడ్డి రాజకీయ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. బిఆరఎస్ ఊహించుకున్నంతగా పభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత మాత్రం లేదని రుజువైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు మరిsం నమ్మకం బలపడింది. ప్రతిపక్షాల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. ప్రజా ప్రభుత్వం మీద మరింత నమ్మకం పెరిగింది చెప్పడానికి ఈ ఎన్నికలు నిదర్శనయ్యాయి. మరో రకంగా సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వం మీద విశ్వాసం మున్సిపల్ ఎన్నికల తీర్పులో కనబడింది. సాదారణ సమయాల్లో ఎలా వున్నా, ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వున్న ఐక్యత బాగానే పనిచేసిందనేది కూడా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారిన వ్యూహం బాగానే నెరవేరింది. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పులే కాదు, కాలం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చిందనేది రుజువైంది. జనగాం, తొర్రూర్‌లలో కాంగ్రెస్‌ను లాటరీ విజయం వరించింది. సమానమైన ఓట్లు వచ్చినా లాటరీ గాయిగాయి చేసిన బిఆరఎస్ ఆశలపై కాలం నీళ్లు చల్లింది. బిఆరఎస్, బిజేపి ప్రజా పోరాటాలు లేకుండా చెబుతున్న ఫాల్త్ ముచ్చట్లు జనం నమ్మరని తేలిపోయింది. బిఆరఎస్, బిజేపిలు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తూ, జనాన్ని నమ్మించి మోసం చేస్తున్నారని మరోసారి తేలింది. ప్రతిపక్ష బిఆరఎస్, బిజేపిలు మీడియా పులులు కాగితాలకు పరిమితమని మరోసారి రుజువైంది. సిఎం. రేవంత్‌రెడ్డి రాజకీయ వ్యూహాలు అధ్భుతమైన విజయాలు సాదించాయి. పభుత్వం మీద ఎక్కడా తీవ్ర వ్యతిరేకత మాత్రం లేదని రుజువైంది. రెండేళ్లపాలనైన ఎంతో కొంత అసంతప్తి వున్నా, అది వ్యతిరేకత దాకా దారి తీయలేదు. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వుంటే ఖమ్మం జిల్లాలో కూడా అది కనిపించాలి. అక్కడ ఎక్కడా వ్యతిరేకత కనిపించిన దాఖలాలు లేవు. అలాగే నల్లగొండ జిల్లా, మహాబూబ్ నగర్ జిల్లాలోనూ ప్రభుత్వానికి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక రకంగా కాంగ్రెస్ స్వీప్ చేసినట్టే అని చెప్ప్పుకోవాలి. ఇలా మూడు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఈ మూడు జిల్లాల్లో జనం ఎందుకు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారన్నదానిపై కూడా అద్యయనం చేయాల్సి వుంటుంది. మిగతా జిల్లాల కన్నా, ఈ మూడు జిల్లాలకు ప్రభుత్వ నిదుల వరద పారిస్తోందా? అభివద్ది మీద ఎక్కువ దష్టిపెడుతుందా? అనేది కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ నియోజకవర్గాలకేనా నిదులు అంటూ కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చేది. అలాగే ఇక్కడ కూడా బలమైన మంత్రులున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. అందులో ఒÅ£రు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వున్నారు. తెలంగాణలో పవర్ ఫుల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వున్నారు. రాజకీయంగా, పాలనా పరంగా అనుభవం వున్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. ఈ ముగ్గురి రాజకీయం ముందు బిఆరఎస్ మరోసారి చతికిలపడింది. కోలుకోలేని దెబ్బ తిన్నది. ఇక నల్లగొండ విషయానికి వస్తే ఇక్కడ బలమైన నాయÅ£త్వం పనిచేసిందనే చెప్పాలి. రాజకీయంగా, పాలనాపరంగా అపరామైన అనుభవం వున్న సీనియర్ నాయకుడు జానారెడ్డితోపాటు, ఆయన వారసులు, ఇద్దరూ ప్రజా ప్రతినిదులుగా వున్నారు. వారికి తోడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వున్నారు. సీనియర్ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వున్నారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు అన్ని నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగిరింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ సర్పంచ్‌లు గెలిచింది. ఆ పరంపర మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఇక్కడ వార్ వన్ సైడ్ జరిగింది. ఇక సిఎం. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు మరో సారి కాంగ్రెస్ జయకేతనం ఎగురువేసింది. పాలమూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించినట్లైంది. సిఎం. రేవంత్‌రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్‌లో బిఆరఎస్‌కు చోటు లేకుండాపోయింది. మొత్తం సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి సిఎం.తో పాటు మరో ఇద్దరు మంత్రులున్నారు. వారు కూడా తమ సత్తాను చాటుకున్నారు. సీనియర్ మంత్రి జూపల్లి కష్ణారావు, మరో మంత్రి వాకిటి శ్రీహరిలు కూడా బాగా కష్టపడ్డారనేది విషయం తేట తెల్లమైంది. మహాబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అయితే ఈ విజయాన్ని సిఎం. రేవంత్‌రెడ్డి పాలనకు అంకితమివ్వొచ్చని చెప్పొచ్చు. ఆయన అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలే కదా? అని ఊరుకోలేదు. ఏది ఏమైనా గెలుపు ముఖ్యం. గెలిచి తీరుడు చాలా ముఖ్యం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. ప్రజలను ఒప్పించారు. తనపై నమ్మకం వుంచాలని కోరారు. ప్రజలు కూడా అలాగే తీర్పునిచ్చారు. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లలేదని కాంగ్రెస్‌ను గెలిపించారు. ఈ గెలుపు కాంగ్రెస్‌కు మరింత ఊపునిచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత లేదని చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. అదే సమయంలో కాంగ్రెస్‌ను బిఆరఎస్ కూడా బలంగానే డీ కొట్టిందనే చెప్పాలి. బిఆరఎస్‌కు ఊహించని సీట్లే వచ్చాయి. నిజానికి ఓ ఐదారు మున్సిపల్ చైర్మన్లు వస్తాయని మాత్రమే అనుకున్నారు. కాంగ్రెస్‌కు 80శాతానికి పైగా కౌన్సిలర్లు , కార్పోరేటర్లు గెలుస్తారని అంచానా వేశారు. కాని బిఆరఎస్ బలంగానే కాంగ్రెస్‌తో కొట్లాడిందనే చెప్పాలి. అయినా ఇంకా ఎక్కడో బిఆరఎస్ వెనుకబడింది. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్దగా ప్రచారం కూడా సాగించినట్లు లేదు. ఎంత సేపు హరీష్‌రావు సిద్దిపేట, మెదక్ జిల్లాల మీదనే దష్టిపెట్టారు. మిగతా జిల్లాల్లో ఇంత విరివిగా ప్రచారం సాగించలేదు. బిఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కూడా అన్ని జిల్లాలను చుట్టి వచ్చినా, ఆయన ప్రభావం పూర్తిగా కనిపించలేదు. బిఆరఎస్ బలంగా వుండే ఉత్తర తెలంగాణలో బిఆరఎస్‌కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ జిల్లాలో బిఆరఎస్‌కు మంచి పట్టు వుంది. కరీంనగర్ కార్పోరేష్న్ను నిలబెట్టుకోవాల్సిన చోట చతికిలపడింది. గతంలో వార్ వన్ సైడ్ అనేలా విజయాలు అందుకున్న బిఆరఎస్‌కు వరస ఓటములు వెంటాడుతున్నా, పార్లమెంటు ఎన్నికల తర్వాత కొంత కోలుకున్నట్లే కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్దానానికి పడిపోయిన, బిఆరఎస్ గత సర్పంచ్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్ధానానికి చేరుకోవడం ఒక రకంగా ఊరటనిచ్చే అంశమే. అయినా ఈ బలం చాలదు. వచ్చే ఎన్నికలకు ఈ మాత్రం బలం అసలే సరిపోదు. కాకపోతే బిఆరఎస్ నాయకులకు, కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికలు కొంత మనో ధైర్యాన్నే కల్పించాయని చెప్పాలి.
