`కరీంనగర్ మిల్లర్ల పాలిట శాపం ఆ ‘‘గిరి’’?
`’’గోపాలుడికి’’ వందల కోట్ల వడ్లు?

`కరీంనగర్ ఫైల్స్..’’కృష్ణ’’ లీలలు? మూడో కంటికి ‘‘చిక్కడు దొరకడు’’?
`యదేచ్చగా నిబంధనలకు అధికారుల తూట్లు?

`బియ్యం అక్రమ రవాణాతో ‘‘కోట్లు’’ గడిరచి?
`అక్రమ బియ్యం రాష్ట్రాలు దాటించి?
`అక్రమ మిల్లింగ్ సామ్రాజ్యం స్థాపించి? ‘‘శిరోంచ’’దాకా విస్తరించి?
`అధికారుల కళ్ళముందే సొంత లారీలల్లో దర్జాగా బియ్యం దాటించి?
`ఇతర మిల్లర్ల నోట మట్టి కొట్టి?
అధికారులకు ‘కృష్ణ’’ లీలలు చూపించి?
`వృత్తిలో ‘‘లా’’ గిరి.. వ్యవహారంలో ‘‘తోటి మిల్లర్లపై’’ ‘‘దాదాగిరి’’?
`ఓ ‘‘మాజీ మంత్రి’’ అండదండలతో ఎదిగిన’’గిరి’’..అధికారులను గుప్పిట్లో పెట్టుకుని తోటి మిల్లర్ల పై’’దాదాగిరి’’?
`అక్రమాలలో ఆరితేరిన ‘‘గిరి’’కి..అధికారుల చెంచాగిరి?
`అధికారులపైనే ఆధిపత్యం,పెత్తనం?
`లంచాలకు ఆశపడిన అధికారులందరూ ‘‘గిరి’’కి వంగి వంగి?
హైదరాబాద్, నేటిధాత్రి:
ఒక వ్యక్తి ఎదగడం అనేది గొప్ప విషయం. కాని ఎలా ఎదిగాడన్నదే చాలా ముఖ్యం. సినిమాలలో చెప్పినట్లు అక్రమ మార్గాలు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎదిగిన వ్యక్తి ఎప్పటికైనా సమజానికి ప్రమాదకరం. ఎదిగిన వ్యక్తికి ఎవరైనా సలాం కొడతారు. కాని ఒక వ్యక్తి ఎదగడానికి ఎవరూ సాయపడరు. అలాగే ఉద్యోగ వ్యవస్ద కూడా అక్రమ మార్గాలలో ఎదిగే వారికి, ఎదిగిన వారికి సాయపడుతుంది. దాంతో వ్యవస్ద మొత్తం కుంటు పడుతుంది. ఒక్కొసారి మొత్తం వ్యవస్ధ కుప్పకూలిపోతుంది. ఇక్కడా అదే జరిగింది. తెలంగాణలో మిల్లింగ్ వ్యవస్ధలో ఒక జిల్లాకు జిల్లానే గుప్పిట్లో పెట్టుకునేలా ఒక వ్యక్తి ఎదిగాడు. మర్రిచెట్టులా పాతుకుపోయాడు. మర్రి చెట్టు కింది గడ్డి కూడా మొలవదని సామెత. ఆ సామెతను కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మిల్లర్ నిజం చేస్తున్నాడు. కొన్ని దశాబ్దాలుగా మిల్లింగ్ వ్యవస్ధ మీద ఆదారపడి వ్యాపారం, జీవనం సాగిస్తున్న వారందరి జీవితాలను ఒక్క వ్యక్తి తలకిందులు చేశాడు. తన ఆధిపత్యం మొదలు పెట్టాడు. తన కనుసన్నల్లో ఆ వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అదికారులను తన వైపు తిప్పుకున్నాడు. అధికారుల అండదండలతో ఇతర మిల్లర్ల జీవితాలను ఆగం చేస్తున్నారు. ఏ దేశమైనా సరే సమ సమాజ స్ధాపన కావాలని కోరుకుంటుంది. ఏ సమాజమైనా అందరూ సమానమే అని చెప్పాలని చూస్తుంది. వ్యాపారం రంగంలో ఉన్నత స్దానానికి చేరుకోవాలని అందరూ అనుకోవాలి. ఆ పోటీ తత్వం వుండాలి. కాని వ్యాపారం నీతిగా చేయాలి. నిజాయితీగా చేపట్టాలి. అలా కరీంనగర్లో నిజాయితీకి మారుపేరుగా వున్న అనేక మంది మిల్లర్లకు కంట్లో నలుసుగా మారిన ఓ వ్యక్తి ఇతరుల వ్యాపారం సాగకుండా చేస్తున్నాడు. వారి వ్యాపారాలు నడవకుండా చూస్తున్నాడు. మొత్తం వ్యవస్ధను తనే శాసిస్తున్నాడు. తన తెలివితేటలతో ఇతరుల జీవితాలను జీవితాలను తలకిందులు చేస్తున్నాడు. అధికారులు పూర్తిగా ఆ వ్యక్తికి సేవ చేస్తున్నారు. ఇతర మిల్లర్లకు చుక్కలు చూపిస్తున్నారు. పేరు మాత్రం సర్వాంతర్యామి పేరు పెట్టుకున్నాడు. కాని కరీనంగర్‌లో తన వ్యాపారం ద్వారా సర్వం దోచేస్తున్నాడు. అందుకు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. మిల్లింగ్ వ్యవస్ధలో ఇతరులకు అడ్డంకులు సృష్టిస్తూ తన వ్యాపారం రాష్ట్రాలు దాటిస్తున్నాడు. పదుల సంఖ్యంలో మిల్లులను ఏర్పాటు చేసుకున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, తన మిల్లింగ్ వ్యాపారాన్ని సిరోంచిలో కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాని ఎక్కడా ఆ వ్యక్తి పేరు వుండదు. అందరూ బినామీల పేరుతో తన వ్యాపారాన్ని సాగిస్తుస్తున్నాడు. అన్నీ తప్పుడు విధానాలే? అంతా తప్పుడు పద్దతులే? అంతా మోసమే? అని తోటి మిల్లర్లు ఆ వ్యక్తి గురించి చెబుతున్నారు. ఆ వ్యక్తి వల్ల ఇతర మిల్లర్ల జీవితాలే కాదు, వారికి వ్యాపారం లేకుండా చేస్తున్నాడు. ఏ ఒక్క మిల్లు తన పేరు మీద వుండదు. కాని మిల్లులన్నీ అతని ఆదీనంలోనే వుంటాయి. ఆ వ్యక్తి కోరుకున్నంత వరి దాన్యం అదికారులు సరఫరా చేస్తారు. అడిగినంత దాన్యం ఇస్తుంటారు. పుట్లకు పుట్లు వడ్లన్నీ ఆ వ్యక్తి మిల్లులకే అదికారులు కేటాయిస్తుంటారు. ఇలా వడ్లును తన మిల్లలకు దారి మల్లించుంటూ అక్రమ బియ్యం వ్యాపారంలో ఆ వ్యక్తి ఆరితేరిపోయాడు? అని ఇతర మిల్లర్లు చెబుతున్నారు. తెలంగాణ నుంచి అక్రమ బియ్యం రవాణాకు ఆ వ్యక్తి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఇలా వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నాడు. అందుకు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు? తన మిల్లింగ్ సమాజాన్నే కాదు, మొత్తం జిల్లా సివిల్ సప్లయ్ శాఖను కూడా ఆ వ్యక్తి శాసిస్తున్నాడు. జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో డిఎం. దగ్గర నుంచి డిటీల దాకా ఆయన చెప్పే మాటనే అనుసరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అనదికార అన్ని పోస్టులు ఆ వ్యక్తే నిర్వహిస్తుంతం పెత్తనం చేస్తున్నాడు. తనకు ఎంత ధాన్యం కావాలో కూడా అదికారులకే ఆర్డర్ వేస్తుంటాడని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తి చేతుల్లో అధికారులంతా కీలుబొమ్మలైపోయారు. ఇక విజిలెన్స్ అధికారులు కూడా ఆ వ్యక్తి చెప్పిందే వేదం అన్నట్లు ఆచరిస్తారు. ఆ వ్యక్తి చెప్పిందే రాసుకొని విజిలెన్స్ అధికారులు వెళ్లిపోతారు. విజిలెన్స్ అధికారులు ఆ వ్యక్తి మిల్లుల వద్దకు వెళ్లేది లేదు. అక్కడి వడ్లను, బియ్యాన్ని పరిశీలించేది లేదు. ఆ వ్యక్తి ఎంత చెబితే అంత రాసుకోవాలి. ఇచ్చిన సొమ్ము పట్టుకొని విజిలెన్స్ అధికారులు పట్టుకువెళ్లాలి. అలా అధికారులను మేపడం నేర్చుకున్నాడు. దాంతో ఆ వ్యక్తికి ఎదురులేకుండాపోయింది. పైగా అన్ని పార్టీల నాయకులు ఆ వ్యక్తి గుప్పిట్లోనే వుంటారు. వారికి కావాల్సింది కూడా ఈ వ్యక్తి సమకూర్చుతుంటాడు. పాలకులు మారినా ఆ వ్యక్తి ఆదిపత్యం తగ్గలేదు. పైగా మరింత పెరిగిందని అంటున్నారు. అధికారులు ఇంతలా భరితెగించి నిబంధనలకు తూట్లు పొడిచి, ఇతర మిల్లర్ల పొట్ట గొట్టి వడ్లన్నీ ఆ వ్యక్తి మిల్లులకే కేటాయిస్తున్నారు. ఆ వ్యక్తి బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. అటు వడ్లు ఇస్తున్నారు. ఇటు బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఒక అక్రమ మిల్లర్‌కు సివిల్ సప్లయ్ ద్వారా ఎన్ని రకాల సహాయ సహకారాలు అందాలో అన్ని అడ్డగోలుగా అందిస్తున్నారు. కరంనగర్తోపాటు, పొరుగున వున్న జిల్లాల వడ్లును కూడా ఆ వ్యక్తికే అదికారులు సంతర్పణలా అందిస్తున్నారు. ఆ వ్యక్తి ఇచ్చే ముష్టికోసం అధికారులు ఎగబడుతున్నారు. ఇతరమిల్లర్లకు శఠగోపం పెడుతున్నారు. ఆ వ్యక్తి ఇచ్చే లంచాలకు అధికారులు దాసోహం అంటున్నారు. అలా ప్రభుత్వ సొమ్మును ఆ ఒక్క వ్యక్తి, అదికారులు అంతా కలిసి మింగేస్తున్నారు. ఈ వ్యక్తి అక్రమ దందా ఇతర మిల్లర్లకు శాపంగా మారింది. వారి ఆర్తనాదాలు అదికారులకు కనిపించడం లేదు. ఆ వ్యక్తి లీలలు ఇతరులకు ఎవ్వరికీ కనిపించవు. అదికారులు ఈ వ్యక్తి కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అటు వడ్ల ద్వారా, ఇటు అక్రమ బియ్యం రవాణా ద్వారా వందలకోట్లు సంపాదించుకుంటున్నాడు. రోజుకు లక్షలాది రూపాయలు అధికారులకు విసిరేసి, కోట్లకు అదిపతిగా పోయాడు. ఏకంగా అక్రమ మిల్లింగ్ సామ్రజ్యాన్నే స్దాపించాడు. ఇలా అక్రమ బియ్యం వ్యాపారం కోసం ఏకంగా నలభై లారీలు కూడా ఆ వ్యక్తి కొనుగోలు చేశారు? ఆ లారీలను ఆపడానికో, అడ్డుకోవడానికో ఏ ఉద్యోగి సాహసించరు. పైగా ఆ లారీలు ఎక్కడా ఇబ్బంది పడకుండా అధికారులంతా సహరిస్తుంటారు. అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తుంటారు. కరీంనగర్ నుంచి సిరోంచ దాకా ఆ లారీలు చేరే దాకా అదికారులే కంటికి రెప్పలా వాటిని కాపాడుతుంటారు. కంచె చేను మేస్తే ఎలా వుంటుందో అదికారులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఇతర మిల్లర్ల నోట్లో మట్టికొట్టేందుకు అధికారులే దగ్గరుండి సహకరిస్తున్నారు. దాంతో ఇతర మిల్లర్లు ఎవరూ ఆ వ్యక్తిని ప్రశ్నించేందుకు కూడా ధైర్యం చేయడంలేదు. అటు వకాలత్లో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఆ వ్యక్తి లీలలు అన్నీ ఇన్నీ కావు. వృత్తి వేరు. ప్రవృత్తి వేరు. వృత్తి మాత్రం న్యాయం ముసుగు తొడుక్కున్నది. ప్రృవృత్తి అన్యాయాన్ని చేసేది. ఇలా తన వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెలిపోయేందుకు రెండు వైపులా వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఇతర మిల్లర్లను గోస పెడుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెడితే వందల కోట్లు ఒక వ్యక్తి జేబులోకి అక్రమంగా వెళ్లకుండా చేయొచ్చు. ఆ వ్యక్తి చేసే అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయొచ్చు. పేదలకు అందాల్సిన బియ్యం ఆ వ్యక్తి జేబులోకి వెళ్లకుండా , రాష్ట్రం దాటి బియ్యం తరలిపోకుండా ఆపోచ్చు. రాష్ట్ర స్దాయి అదికారులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారో లేదో చూడాలి. నలభై, యాభై ఏళ్లుగా మిల్లింగ్ నీతిగా,న్యాయంగా మిల్లింగ్ వ్యాపారం సాగించిన పేరున్న మిల్లర్లకుకూడా ఈ వ్యక్తి చుక్కలు చూపిస్తున్నాడు. ప్రజా ధనం తన జేబులో వేసుకుంటున్నాడు. అది పైసో పరకో కాదు..వేలు.లక్షలు కాదు..కోట్లకు కోట్లు ప్రభుత్వ ఖజానకు దర్జాగా గండికొడుతున్నాడు. ఇప్పటికైన ఉన్నత స్ధాయి అదికారులు మేలుకుంటే మంచిది.
