ఎమ్మెల్యే దొంతి
#నెక్కొండ, నేటి ధాత్రి:వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇవ్వనున్నట్టు నెక్కొండలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభాముఖంగా కార్యకర్తల పక్షాన నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి బలరాం నాయక్ కు మాటిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నెక్కొండ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో 39 గ్రామాల నుండి భారీగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో 18 వేల మెజార్టీ ప్రజలు నాకు ఇచ్చారని, కానీ వచ్చేనెల లో జరిగే పార్లమెంటు ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గం నుండి 44 వేల పై మెజార్టీ ఇవ్వనున్నట్టు కార్యకర్తల ఉత్సాహం చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి తెలంగాణ గురైందని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాయమాటలతో ప్రజలను మోసగించి దుష్ట పరిపాలన చేసిన గత ప్రభుత్వ విధానాలను సహించక ప్రజలు బుద్ధి చెప్పినారని ఆయన గుర్తు చేశారు. మానుకోట కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ దేశంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని ఇది ప్రజలు గమనిస్తున్నారని చరిత్ర చెబుతున్నదని 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో చేసిందని అది దేశ ప్రజలకు తెలుసాని, సోషల్ మీడియాలలో, పత్రికలలో, తప్పుడు రాతలు రాయించుకున్నంత మాత్రాన ప్రజలు పొందిన సౌకర్యాలను ఎవ్వరూ ఎప్పుడు మర్చిపోరని ఆయన గుర్తు చేశారు. నెక్కొండలో నేటి నుండి నెల రోజులపాటు ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ రద్దు చేస్తే ఉలుకు పలుకు లేని కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ నేతలు గాని, మానుకోట పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి నేతలకు గాని సోయలేఖ పాయె అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సభాముఖంగా రైల్వే అధికారులను కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కి సవాలు ఇస్తున్నానని మీకు ప్రజలపై ప్రేమ ఉంటే నెక్కొండలో ఈ నెల రోజులపాటు ప్రత్యామ్నాయ ట్రైన్ లను ఆపాలని లేనిచో మిమ్మల్ని ప్రజలు క్షమించరని ఓటుతో మీకు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి అశోక్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కలపల్లి రవీందర్రావు, పెండెం ఆనంద్ , పాలాయి శ్రీనివాస్ ,శ్రీ రామలింగేశ్వర ఆలయ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, ఓబీసీ జిల్లా నాయకుడు రాచకొండ రఘు, జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జలంధర్ రావు భారత్ మోహన్ నాయక్, కుసుమ చెన్నకేశవులు, ఈదునూరి ప్రభాకర్, గంధం సుధాకర్, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.