
"World’s First Robot Mall in Beijing"
చెఫ్ రోబో ఏ వంటలు వండుతుంది..
డుతుంది?’… ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’… ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే.
‘ఐన్‌స్టీన్ రోబోతో ఏమిటి ఉపయోగం?’… ‘చెఫ్ రోబో ఏ వంటలు వండుతుంది?’… ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’… ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో మాల్‌ను చైనా రాజధాని బీజింగ్‌లో ఇటీవలే ప్రారంభించారు. నాలుగు అంతస్తుల ఈ మాల్లో అబ్‌టెక్ రోబోటిక్స్, యునిట్రీ రోబోటిక్స్ లాంటి 200 బ్రాండ్లకు సంబంధించిన… వంద రకాల రోబోలు విక్రయానికి ఉన్నాయి.
గ్యాడ్జెట్ రోబోలతో పాటు అతి ఖరీదైన హ్యూమనాయిడ్ రోబోలూ కొలువుదీరాయి. 300 అమెరికన్ డాలర్ల నుంచి లక్ష డాలర్లదాకా ధర పలికే రోబోలున్నాయి. ఈ మాల్‌ను ‘4ఎస్’ అంటున్నారు. అంటే రోబోలకు సంబంధించి సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్, సర్వే అన్నమాట. ‘ఇలాంటి రోబో మాల్‌లు త్వరలో ప్రపంచమంతా వ్యాపిస్తాయ’ంటున్నారు టెక్ నిపుణులు.