
బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల : నేటిధాత్రి జనగామ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేర్యాల మండలంలోని గురువారం వెచరేని దానంపెళ్లి చిట్యాల తాడూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో జనగామ బిఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. గ్రామాలలో మహిళలు ఆయనకు హారతిచ్చి పూలు చల్లుతూ గ్రామంలోకి గణ స్వాగతం పలికారు ఆహ్వానించారు. ఇంటింటికీ తిరుగుతూ ఆయన ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జనగామ నియోజకవర్గంలో అత్యధిక 70 వేల నుండి 80 వేల వరకు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు మొదటి నుండి జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ కంచుకోటగా గుర్తింపు పొందినందున అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమ వ్యక్తం చేశారు కెసిఆర్ పెట్టిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు .ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని, అభివృద్ధిని చేసి చూపిస్తానని . నేను ఓటర్లే తన దేవుళ్లని, తాను పూజారిగా సేవలు చేసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లింగల ఏకనాదం గదారాజు మండల శ్రీరాములు చేర్యాల నాయకులు సుంకరి మల్లేశం వీరన్నపేట సర్పంచ్ బిక్షపతి తాడెం రంజిత కృష్ణమూర్తి తాటికొండ సదానందం రాళ్ల బండి చందు ఒకులాభరణం నరసయ్య పంతులు పాల బాలరాజు మరియు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు