
ఓం నమో వెంకటేశాయ నమః
రండి తరలిరండి మహా పాదయాత్రకు
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చెంతకు పాదయాత్రగా బయలుదేరనున్న గండ్ర జ్యోతి భూపాలపల్లి మంజూరు నగర్ లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం,స్వామి వారి ప్రతిష్ట అనంతరం మొక్కుకోబడిన మొక్కునుచెల్లించుకుంనేందుకు ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి మంజూరు నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధి నుంచి ప్రారంభం కానున్న మహాయాత్ర
20-01-2024 అనగా శనివారం సమయం:-7:30 ని||భక్తులు స్వామి యాత్రకు పాదయాత్రగా రావాలనుకుంటే సంసిద్ధులు అయి బయలు దేరాలి. భూపాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి 15 రోజుల పాటు 700 వందల కిలోమీటర్ల వరకు సాగనున్న పాదయాత్ర ఆసక్తికలిగినప్రజలు,భక్తులు,అందరూ ఆహ్వానితులే.
కావున ఈ కార్యక్రమంలో
మన శాయంపేట మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, పిఏసియస్ పాలకవర్గ సభ్యులు,రైతు బంధు కోఆర్డినేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, అన్ని అనుబంధ కమిటీల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరడమైనది.