Date 07/03/2024
—————————————-
లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలకు ఖమ్మం జిల్లా నాయకుల గూడెం టోల్ గేట్ వద్ద పలువురు ప్రముఖులు ఆత్మీయ స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు.రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఖమ్మంకు మొదటి సారి విచ్చేస్తున్న వద్దిరాజు,బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న నామ,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్యలకు సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు పారా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావులకు పుష్పగుచ్ఛాలిచ్చి శాలువాలతో సత్కరించారు.ఎంపీలు నామ,వద్దిరాజులకు మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుట్టం పురుషోత్తం రావు,సంఘం నాయకులు వద్దిరాజు కిషన్, జాంబిశెట్టి శ్రీనివాస్ రావు,తీగల విజయ్,మడూరి పూర్ణ, నాగసాయి రాజశేఖర్, బీఆర్ఎస్ నాయకుడు బానోతు నవీన్ తదితరులు స్వాగతం పలికారు.