
Mohammed Azeem.
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాం టీయూడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్
మెట్ పల్లి ఆగస్టు 5 నేటి ధాత్రి
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని టీ యు డబ్ల్యూజే (ఐజెయు) అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ అన్నారు.సోమవారం వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మెట్ పల్లి కార్యవర్గ సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా తీర్మానించారు.
అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్ మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా యూనియన్ లో ఉన్న అందరి జర్నలిస్టుల సహకారంతో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టి యు డబ్ల్యూ జే (ఐజెయు) యూనియన్ పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు మాసుల ప్రవీణ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ , బాసెట్టి హరీష్ ,విజయసాగర్, మహమ్మద్ అఫ్రోజ్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ సభ్యులు బొల్లం రాజు,ఆదిల్ పాషా, ఏసవిని గణేష్ ఎండి అభిద్, సషీ, రాజశేఖర్ , అమ్ముల ప్రవీణ్,ఎస్ పి రమణ , తదితరులు పాల్గొన్నారు.