BC JAC Demands 42% Reservations
బీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం
కాంగ్రెస్,బిజెపిలకు బీసీలపై సిద్ధ శుద్ధి లేదా?
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి
బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేసి కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందేనని మంచిర్యాల ఐబీ చౌరస్తా దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాను ఉద్దేశించి బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్, బీసీ జేఏసీ నాయకులు నరెడ్ల శ్రీనివాస్,కొండిళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన మాటను పక్కనపెట్టి నేడు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెడతామని,రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో కుర్చీ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.బీసీలను మోసం చేసి ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీసీ ప్రజలు నమ్మరు అని అన్నారు.కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ పార్టీ ఆనాటికి,ఈనాటికి బీసీలపై కక్షపూరిత వైఖరితోనే వ్యవహరిస్తుందని,పేరుకు మాత్రమే బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీల విషయంలో కూసమెత్తు పని కూడా చేయలేకపోయినా అసమర్థులని విమర్శించారు.కాంగ్రెస్ బిజెపిలకు నిజంగా బీసీలపై ప్రేమ చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా బీసీల రిజర్వేషన్లను పెంచి జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ,వ్యాపార,రాజకీయ రంగాలలో అవకాశాలు అందించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని లేనిపక్షంలో రాష్ట్రాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ బిజెపి పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు కర్రే లచ్చన్న, తులా మధుసూదన్ రావు, ముతోజు రమేష్,జైపూర్ బీసీ జేఏసీ నాయకులు,వేముల మల్లేష్,ఆడెపు గణేష్,సమ్మన్న, శ్రీరాంపూర్ బీసీ జేఏసీ నాయకులు,గార్గే చేరాలు,నాగరాజు,హాజీపూర్ బీసీ జేఏసీ నాయకులు వేముల అశోక్,మడిపల్లి సత్యనారాయణ,మహేందర్ బీసీ జేఏసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
