సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్.
కారేపల్లి నేటి ధాత్రి
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ రవన్న, ప్రజాపంథా సీనియర్ నాయకులు పిండిప్రోలు సర్పంచ్ రాయల నాగేశ్వరరావుల వారిద్దరి పోరాట స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకొని మాస్ లైన్ పార్టీతో ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్ అన్నారు.
భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సమ సమాజమే లక్ష్యంగా 48 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపిన భారత విప్లవోద్యమ నేత సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 8వ వర్ధంతి మరొకరు రవన్న తమ్ముడు ప్రజాపంథా సీనియర్ నాయకులు పిండిప్రోలు సర్పంచ్ (5 టైమ్స్) ప్రజాధరణ పొందిన ప్రజానేత కామ్రేడ్ రాయల నాగేశ్వరరావు మొదటి వర్ధంతి సందర్భంగా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో కామ్రేడ్ రవన్న ,కామ్రేడ్ నాగన్నల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది.. సందర్భంగా మాస్ లైన్ నేత రాకేష్ మాట్లాడుతూ కామ్రేడ్ రవన్న 48 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి భారత విప్లవోద్యమానికి పోరాడారు, కామ్రేడ్ రాయల నాగేశ్వరరావు ఐదు పర్యాయాలు ప్రజా ప్రతినిధిగా ఉంటూ నిత్యం ప్రజలలో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడారు.వీరిద్దరి మరణం భారత విప్లవోద్యమానికి, ప్రజా ఉద్యమాలకు, ప్రజాపంథాకి తీరని నష్టం అయినప్పటికీ వారిద్దరి పోరాట స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకొని మాస్ లైన్ పార్టీతో ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు నిర్మిస్తామని వారన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్ లైన్ మండల నాయకులు చల్లా రాజు నాయకులు ప్రణయ్ చరణ్ తేజ్ ముత్తయ్య వెంకటేశ్వర్లు బాబు తదితరులు పాల్గొన్నారు.