
బీఆర్ఎస్ కార్యకర్తలను సంతలో పశువుల్లా కాంగ్రెస్ కొనుగోలు చేస్తున్నారు
ముత్తారంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు
ముత్తారం :- నేటి ధాత్రి
బీఆర్ఎస్ కార్యకర్తల దిశా నిర్దేశ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తేనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు అన్నారు. బుధవారం ముత్తారం మండలం కేంద్రాల్లోని ఫంక్షన్ హాల్ లో మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పుట్ట మధు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మంథని నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు చేస్తున్నారని పుట్ట మధు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికీ తిరిగి గడపగడపకు కేసిఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు తన సొంత మేనిఫెస్టో గురించి వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంఖ్యకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కేవలం ఓటమి భయంతోనే శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు విరుగుడుగా బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడాలని ఆయన హితబోధ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇప్పటివరకు జరిగిన రెండు సర్వేలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్, జెడ్పిటిసి చెల్కల స్వర్ణలత అశోక్ యాదవ్, బీఆర్ఎస్ వైస్ ఎంపీపీ సదాటి రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అల్లం తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పప్పు స్వరూప చంద్రమౌళి, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బేద సంపత్, ఇల్లందుల అశోక్, పప్పు చంద్రమౌళి, సర్పంచులు పులిపాక నాగేష్, సంపత్ రావు, మహేందర్ యాదవ్, పర్ష లక్ష్మి శ్రీనివాస్, సతీష్ గౌడ్. ఉప్పు సుగుణ శ్రీనివాస్, ఎంపీటీసీలు బియ్యని శ్యామల సదానందం, రామగల్ల పోచమ్మ మధుకర్, మహిళా కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.