ఆపదలో ఉన్నా వారికి అండగా ఉంటాం

ఆపదలో ఉన్నా వారికి అండగా ఉంటాం

ట్రస్ట్ తరపున 22500 రూపాయలు ఆర్ధిక సాయం

*దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు.

*జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్

మంగపేట నేటిధాత్రి

ఇటీవల కాలం లో కమలాపురం గ్రామానికి చెందిన బందెల లక్ష్మీ ఆరోగ్యం బాగోలేక చనిపోయింది చాలా బీద కుటుంబం ఎవరు లేరు ఈమె కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు కోడలు బయట పని చేస్తూ పిల్లలను ఈమెను చూసుకుంటుంది కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు ఈమె దహణసంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వాట్సాప్ గ్రూపులలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు ఆ వాట్సప్ గ్రూపులలో ఉన్న వారు కొంతమంది దాతల సహాకారం తో ఈ రోజు కర్మలు ఉండటంతో వీరోకి దాతల దగ్గర నుంచి సేకరించిన 22500 రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ

ఈ విషయం గురించే కాకుండా ఎవరికైనా ఆపద ఉంది అని జ్వాలా ట్రస్ట్ దృష్టికి వస్తే కచ్చితంగా మా జ్వాలా ట్రస్ట్ దాతలసహకారం తో సహాయం అందిస్తుందని ఇప్పటి వరకు ప్రతీ ఒక్క కారిక్రమానికి సహాయం అందించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా మా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ తరుపున నా తరుపున పాదాభివందనం తెలియజేస్తున్నాం అంతేకాకుండా సహాయం అని అడిగిన వారికి మీకు తోచినంత సహాయం అందించాలని మనం చేసే సహాయం ఆ దేవుడు మనకు తిరిగి ఏదోఒక రూపంలో తిరిగి ఇస్తాడు మనం చేసే చిన్న సహాయం వారికి అది చాలా పెద్దదని చెప్పారు ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ గౌరవసలహాదారులు సోమేపల్లి భార్గవ్ చౌదరి మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version