
Panchayat Raj Minister Dhanasari Anasuya
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
ములుగు జిల్లా, నేటిధాత్రి:
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షులు కందికొండ గంగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షులు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మందాటి రజిని, ఉపాధ్యక్షురాలుగా పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూనియన్ సభ్యులు చల్లూరు మహేందర్ పెండం బిక్షపతి, ధనుంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.