మండలంలో 46 భూ సంబంధిత దరఖాస్తులు.
మహదేవపూర్- నేటి ధాత్రి;
ప్రజావాణిలో వచ్చిన వినతుల సమస్యలను సత్వర పరిష్కారం అందేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తాసిల్దార్ ప్రహ్లాద్ అన్నారు. సోమవారం రోజున మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల ప్రజల నుండి భూ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్థానిక తహసిల్దార్ ప్రహ్లాద్ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ వివిధ గ్రామాలకు సంబంధించిన 46 భూ సంబంధిత వినతులు రావడం జరిగిందని వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరలో వినతుల సమస్యలను పరిష్కరిస్తామని తాసిల్దార్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో తహసిల్దార్ ప్రహ్లాద్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.