
పరిశ్రమ యంత్రాలను తరలిస్తే ఊరుకోం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆదివారం ఉదయం గేటు ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాత్రింపగలు పరిశ్రమ గేటు ముందు నెల రోజుల నుండి నిరసన చేస్తున్న యాజమాన్యం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వేతనాలు, ఇతర బకాయిలు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా యంత్రాలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.