అడ్డగుట్ట లోని పార్క్​ ని అత్యంత సుందరంగాతీర్చిదిద్దుతాం:కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

కూకట్పల్లి, ఫిబ్రవరి 27 నేటి ధాత్రి ఇన్చార్జి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల పార్క్ పరిసరా లను జిహెచ్ఎంసి హరికల్చర్ అధి కారులతో,కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ… అడ్డ గుట్ట కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లోగల పార్కుని పరిశీలించడం జరిగిందని పార్క్​
ని అత్యుత్తమ సౌకర్యాలతో, ప్రజల కు ఆహ్లాదం పంచేలా అభివృద్ధి చే స్తామని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా పార్క్​కి వచ్చేలా వాతావ రణం కల్పించాలని, పిల్లలు ఆడుకు నేందుకు అనువుగా ఆట వస్తువులు
కూడా ఏర్పాటు చేయాలన్నారు.వా కింగ్ చేసుకోవడానికి వచ్చే ప్రజల కు ,వృద్దులకు,పిల్లలకు ఎటువంటి
ఇబ్బంది లేకుండా వాకింగ్ ట్రాక్ ను పార్క్ను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో అన్ని రకాల మౌలిక వసతులు కలిపిస్తామని పార్క్ ను సుందర శోభిత వనం గా తీర్చిదిద్దు తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. పార్క్ అభి వృద్ధి పనుల వేగవంతంపై ప్రత్యే కదృష్టి పెట్టాలని కోరారు. చెరువుల పూడికతీత నుంచి వచ్చే మట్టిని వినియోగించడానికి చర్యలు తీసు కోవాలన్నారు.అదేవిధంగా మీ కాల నీ లో,బస్తీలలో గల ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్క రిస్తానని, డివిజన్ ప్రజలకు ఎల్లవే ళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీని వాస రావు తెలియచేసారు.ఈ కా ర్యక్రమంలో అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్,హార్టికల్చర్ దాసు, కాలనీ వాసులు తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!