
అలంఖాని పేట గ్రామ సర్పంచ్ అనంతలక్ష్మి రవి
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని అలంఖాని పేట గ్రామంలో గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మి రవి మరియు ఎంపీటీసీ కర్పూరపు శ్రీను ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణం కోసం ముగ్గులు పోసే చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మి రవి మరియు ఎంపీటీసీ కర్పూరపు శ్రీను మాట్లాడుతూ అలంకాని పేట గ్రామంలో గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులైన వారికి విడుదలవారీగా ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, ఉపసర్పంచ్ నరసయ్య, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాస్, వార్డ్ సభ్యులు యాకలక్ష్మి, ఉపేందర్, మంగి శెట్టి రాజారాం, వెంకన్న, మంగిశెట్టి కొమ్మలు, నీలం నాగేష్, గృహలక్ష్మి లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.