
Mission Bhagiratha
తాగునీటి సమస్య రాకుండా చూస్తాం..
ప్రతి వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు..
టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు..
రామాయంపేట జూలై 25 నేటి ధాత్రి (మెదక్)
మిషన్ భగీరథ నీళ్లు రాని వార్డులకు తప్పనిసరిగా తాగునీరు అందించాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ చెప్పడం జరిగిందని అందులో భాగంగానే రామాయంపేటలో పలు వార్డుల్లో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగిందని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో మంజీరా స్కూల్ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లు సరాపర కానీ కాలనీలకు పైప్లైన్ మరమత్తు పనులు చేయించి అందరికీ మిషన్ భగీరథ నీళ్లు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ఎమ్మెల్యే రోహిత్ రావ్ కృషి చేస్తున్నారని అన్నారు. ఆ కాలనీలో గత పది సంవత్సరాలుగా నీటి సమస్య, రోడ్లు డ్రైనేజీ సమస్య వచ్చిన ఎవరు పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించడం పట్ల కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు ప్రెసిడెంట్ రెవెల్లి వినయ్ సాగర్, సీనియర్ నాయకులు చింతల స్వామి, ఎనిశెట్టి అశోక్, పోచమ్మల అశ్వినీ శ్రీనివాస్, మరియు కాలనీ పెద్దలు చిలుక ఎల్లయ్య, కరెంట్ గణేష్, ఎనిశెట్టి ఆంజనేయులు, శీలం నరసింహ రెడ్డి, ఎనిశెట్టి వికాస్ తదితరులు పాల్గొన్నారు.