
ఎవ్వరికీ నష్టం కలగకుండా అందరికీ న్యాయం జరిగేలా చేస్తాం..
*కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి నేటి ధాత్రి :
నగరంలోని గాంధీ రోడ్డులో గల హథీరాంజీ మఠంలో దుకాణాలు నిర్వహిస్తున్న ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. పురాతనమైన హథీరాంజీ భవనం కూల్చడం పై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, దుకాణ దారులతో కమిషనర్ సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. పలువురు దుకాణదారులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ మరమ్మత్తులు చేయించాలని కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ హథీరాంజీ మతం ను ఐఐటి తిరుపతి కి చెందిన నిపుణులు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నారుఈ భవనాన్ని 10 జోన్లుగా విభజించడం జరిగిందని అన్నారు. ఇందులో జోన్ 10 మరమ్మతులు చేయాలని, గాంధీ రోడ్డు వైపు,నార్త్ వెస్ట్ కార్నర్లు పడగొట్టి పునర్నిమాణం చేయాలని తెలిపారని అన్నారు.ఈ ప్రజాప్రతినిధులు, షాప్ యజమానులతో సమావేశం నిర్వహించామని అన్నారు. రానున్న వర్షా కాలంలో ప్రజలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపడతాని అన్నారు. కూల్చివేసిన ప్రాంతంలో ఎవరి షాపులు వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాప్రతినిధులు, దుకాణదారులు అభిప్రాయాలను, ఐ ఐ టి నిపుణుల నివేదిక కలెక్టర్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వూకా విజయకుమార్,డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహ ఆచారి, నరేంద్ర మఠం ఏ.డి.బాపిరెడ్డి, ఆర్డీవో రామ్మోహన్, తహసీల్దార్ సురేంద్ర బాబు, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, సర్వేయర్లు కోటేశ్వర రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.