Uppal MLA Promises Saket Colony Development
సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తా
– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి
కాప్రా నేటిరాత్రి
ఉప్పల్ నియోజకవర్గంలోని
సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.
బుధ వారం కాప్రా డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ లో రోడ్డు నీ అలాగే స్టీమ్ వాటర్ డ్రైన్ నీ 44 లక్ష రూపాయల నిధులతో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ నాయకులు భైరీ నవీన్ గౌడ్, సాకేత్ కాలనీ అధ్యక్షులు జిఎస్‌రావు, జాయింట్ సెక్రటరీ రవీందర్రావు, కోశాధికారి చంద్రశేఖర్, రాజేశ్వర్‌రావు, నిరంజన్‌రావు, జగన్నాథరావు, శ్రీనివాసరావు, సాకేత్ స్వర్ణ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, కళ్యాణ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
