
Mulugu Tourism Development
రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తాం
#ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి.
#పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ.
రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తూ, రాష్ట్రంలోనే ములుగు ప్రాంతాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం ఇంచెర్ల గ్రామములో 37 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్, డెవలప్మెంట్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ ను రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,
అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. యూనిస్తో గుర్తింపు పొందిన రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క సారలమ్మ, బోగత జలపాతం, బ్లాక్ బెర్రీ, దట్టమైన అటవీ ప్రాంతాలలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇప్పటికే పలు రకాల పనులను పూర్తి చేయడం జరిగిందని, మిగతా పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారికి సమీపంలో చేతివృత్తుల వారు వారి వృత్తి పనులను చేసుకొని అమ్మ కానికి వీలుగా 37 కోట్ల రూపాయలతో పర్యాటక స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంతో పాటు హ్యాపీ థియేటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రామప్పలో 13 కోట్ల రూపాయలతో ఐర్లాండ్ పనులను చేపట్టడం జరుగుతుందని, ములుగు జిల్లాలో పర్యటక హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు. లక్నవరంలో మరో రెండు ఐలాండ్ పనులను చేపట్టడమే కాకుండా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులను తీసుకురావడం జరిగిందని అన్నారు. సంవత్సరం జనవరి మాసంలో జరగనున్న మేడారం మహా జాతరను పురస్కరించుకొని మేడారం ప్రాంతంలో భక్తుల సౌకర్యం కోసం శ్వాశత పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించిందని, వాటికి సంబంధించిన పనులను త్వరలోనే చేపట్టడం జరుగుతుందని అన్నారు.
మేడారం జాతరలోని జంపన్న వాగు పై భక్తులకు అనుకూలంగా ఐదు కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు.
రాష్ట్రంలోనే ములుగు ప్రాంతాన్ని అభివృద్ధిలో పర్యాటక ప్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రం నుండి నిధులు తీసుకురావడమే కాకుండా కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజులలో ములుగు జిల్లాలు పూర్తిస్థాయిలో పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారి శివాజీ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.