అమరవీరుల ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతాం.

కామ్రేడ్ బి విజయ సారథి, సిపిఐ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి.

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 11 నుండి 17 దాకా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మొదటిరోజు తొర్రూరు మండలంలో సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామాల్లో గల తమ్మెర వెంకటరామ నరసయ్య గారి స్థూపానికి మరియు తెలంగాణ అమరవీరుల స్తూపాలకి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి. విజయ సారధి పాల్గొన్నారు. అమ్మాపురం లో గల స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఊరేగింపు నిర్వహించారు. కామ్రేడ్ విజయ సారధి మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు నైజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి, కోట్లాదిమంది ప్రజలలో చైతన్యాన్ని రగిలించిన యోధులే తెలంగాణ సాయుధ పోరాట యోధులు. రాచరిక వ్యతిరేక పోరాటాన్ని ,హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించే మత చాందసవాదుల కుట్రలను తిప్పికొట్టాలని, అన్నారు. తెలంగాణ చరిత్రలోనూ, పోరాటం తోను సంబంధంలేని మతోన్మాద శక్తులు ఇవ్వాల తెలంగాణ చరిత్రకు మతంరంగును పులుముతున్నాయి. ప్రజలకు, ప్రజాపీడకులైన దొరలు, దేశముకులకు మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ మతంరంగు అంటుగడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట వాస్తవిక గాధ నేటి యువతరానికి తెలియాల్సి ఉంది. ఆనాటి రైతుల పంటలను, భూస్వాములు బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితులలో, దొరల దౌర్జన్యాలను ఎదిరించిన కామ్రేడ్ ఐలమ్మ లాంటి వీరవనితలకు ,గుత్పసంఘం వెన్నుదన్నుగా నిలిచింది. ఉద్యమంపై నీచంగా దాడులు చేస్తూ, అరాచకాలకు పాల్పడిన భూస్వాములపై, సామాన్య ప్రజలు తిరగబడ్డారు. సాంప్రదాయ ఆయుధాలతో భూస్వాములను ఎదుర్కోలేమని భావించిన కమ్యూనిస్టు పార్టీ, 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. రజకర్ల అధ్యక్షుడు కాసిం రజిని అయినా, దానికి ఉపాధ్యక్షుడు ఇదే విసునూరు రామచంద్రారెడ్డి. ఇవాళ ఏ రజివీని అయితే దుర్మార్గుడిగా, కూని కోరుగా మాట్లాడుతున్నామో,అందులో భాగస్తుడే ఈ విసునూరు రామచంద్రారెడ్డికి కూడా భాగం ఉన్నది .అతని తల్లి జానకమ్మ ,అతని కొడుకు బాబు దొర, చేసిన అఘాయిత్యాలకు, అకృత్యాలకు, జనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి తరుణంలో అమ్మాపురం గ్రామం సాయుధ పోరాటయోధులకు నిలయమైంది. ఈ గ్రామం నుంచి ఆనాడు కొండపల్లి గోపాలరావు గారి నాయకత్వంలో ప, గూడెల్లి ఎల్లయ్య, దొనక రాములు, గుంటుక అయిలయ్య,కొత్తూరు నరసయ్య, జనగం సోమయ్య, కొలిపాక సాయన్న, ముడుపు రామిరెడ్డి తదితరులు ఈ పోరాటంలో పాల్గొని, జాల్నా జైలుకు వెళ్లి వచ్చారు .అలాగే ఈ రజాకారుల మూకల దౌర్జన్యానికి ఈ గ్రామాల్లోనే వడ్డేపల్లి పుల్లయ్య, కడుదుల గోపయ్య అనే వ్యక్తులను సజీవదహనం చేసిన చరిత్ర ఈ గ్రామానికి కలదు. కావున ఇటువంటి పోరాటాలను నేడు యువత తెలుసుకొని, ఈ తెలంగాణ పోరాటాలను వక్రీకరిస్తున్న వ్యక్తులకు, పార్టీలకు, బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది.
తదనంతరం కామ్రేడ్ తమ్మెర విశ్వేశ్వరరావు సిపిఐ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ఆనాటి పోరాటయోధుల స్ఫూర్తితోనే, మేము ఇంకా ముందుకు నడుస్తామని ,వారి ఆశయ సాధన కోసం పోరాటాలు నిర్వహిస్తామని ,చెబుతూ ఆనాటి యోధుల కుటుంబాలను ఘనంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది . తదనంతరం హరిపిరాల గ్రామంలో కామ్రేడ్ వల్లపు కొమరెల్లి గారి స్థూపానికి, వెంకటాపురంలోని మొగుళ్ళ మల్లయ్య స్తూపానికి, తోరూరులోని మన్నూరు వెంకటయ్య స్తూపాలకు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఓమా బిక్షపతి,మండల కార్యదర్శి. బందుమహేందర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఘనపురం లక్ష్మను ,డి హెచ్ పి ఎస్ నాయకులు గూడెల్లి ఎల్లయ్య, గ్రామ కార్యదర్శి బూరుగు యాదగిరి, గ్రామ మాజీ సర్పంచులు గూడెల్లి ఎల్లయ్య, మామిళ్ళపల్లి రమేషు, కోటగిరి ఏకాంతం, జనగం శ్రీనివాస్, పంజాల పాపయ్య పబ్బోజు బ్రహ్మచారి తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!