గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

shine junior college

 

 

 

 

ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

 

 

హైదరాబాద్: ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Hyderabad In-charge Minister Ponnam Prabhakar) తెలిపారు. మంగళవారం గోల్కొండ పోర్టులో జరిగిన కార్యక్రమంలో బోనాలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి తొలి బోనాల పండగ ప్రారంభమవుతుందని, ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

 

ఈ ఉత్సవాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల అమ్మవార్లకు ప్రభుత్వం తరుఫున పట్టు వస్ర్తాలను సమర్పిస్తామని మంత్రి తెలిపారు. నెలరోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాల్లో గోల్కొండ కోటకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.

 

 

 

వారికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ హరిచందన, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, గోల్కొండ బోనాల ఆలయ కమిటీ ఛైర్మన్‌ చంటిబాబు, ఫిష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, సౌత్‌వె్‌స్టజోన్‌ డీసీపీ చంద్రమోహన్‌, తహసీల్దార్లు జ్యోతి, అహల్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version