పిఓ డబ్ల్యు రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ
పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గతంలో ఇచ్చిన ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాన్ని 18 వేలకు పెంచాలని కోరుతూ సోమవారం హైదరాబాదులోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించి తీవ్రంగా గాయపరచడం సరైంది కాదని ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.పివైఎల్, పిఓ డబ్ల్యు నేతలు వాంకుడోత్ అజయ్, చండ్ర అరుణ, యదలపల్లి సావిత్రి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం వచ్చాక ఆరు గ్యారెంటీ లతో పాటు ఏడవ గ్యారంటీ మా ప్రభుత్వం ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరిస్తుందని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పురుష పోలీసులతో దాడులు చేయించి కాళ్లు, చేతులు విరగ్గొట్టడం ఏ ప్రజాస్వామ్యమని వారు ప్రశ్నించారు. ఆశా కార్యకర్తలను ఈడ్చుకుంటూ వ్యాన్ లో ఎక్కించే క్రమంలో రహిమాబి అనే ఆశ కార్యకర్త కాలు విరగడంతో స్పృహ తప్పి పడిపోయిందని ఈమెతో పాటు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు. కాలు విరిగిపోయిన ఆశా కార్యకర్త కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటూ రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రకటనలో భాగస్వాములుగా పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు ధరావత్ దేవా, పి వై ఎల్ పి ఓ డబ్ల్యు జిల్లా నాయకులు కోరం ముత్తక్క, ఇస్లావత్ కోటేష్, పూనెం మంగయ్య, సనప కుమార్,యనగంటి గణేష్ వూకే శ్రావణ్, కుంజా రమేష్, పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.