
AITUC leaders
ఏఐటియుసి నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఐఎన్టియుసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు
శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
ఆర్కే5 గనిపై ఇటీవల జరిగిన ద్వార సమావేశంలో ఏఐటియుసి నాయకులు తమకు అసలు సంబంధం లేని విషయాలపై ఘనతను దక్కించుకోవాలని తాపత్రయపడటం దురదృష్టకరమన్నారు. డిపెండెంట్ల వయోపరిమితిని 30 నుండి 40 సంవత్సరాలకు పెంచేలా,మీప్రభుత్వంతో మాట్లాడి యాజమాన్యాన్ని ఒప్పించగలిగిన ఘనత ఐఎన్టియుసి యూనియన్ కే దక్కుతుంది అని అన్నారు. కానీ ఆ విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు తమ విజయంగా చెప్పుకోవడం వారి నీతి మాలిన అసత్య ప్రచారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఐఎన్టియుసి నాయకత్వంలో
బి.జనక్ ప్రసాద్,సెక్రటరీ జనరల్,తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరి బోర్డు చైర్మన్ ప్రభుత్వ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,సింగరేణి చైర్మన్ డైరెక్టర్లతో జరిపిన చర్చలు,సమర్పించిన నివేదికలు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పెద్దపల్లి యువ వికాసం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి
భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్న ఈ సమావేశం అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందన్నారు.
ఈసమావేశంలో మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల సొంతింటి పథకం, అలవెన్సులపై ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు,మారుపేర్ల పరిష్కారం,ఇతర పలు సమస్యలపై
బి.జనక్ ప్రసాద్ సమర్పించిన వినతిపత్రాల అంశాలను సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని స్పష్టంగా ప్రకటించడమే కాక,త్వరలో కార్మికుల కల నెరవేరేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.ఐఎన్టియుసియూనియన్ కృషి, నిబద్ధతా కార్యాచరణకు, విజయపథానికి ప్రత్యక్ష నిదర్శనమని
జెట్టి శంకర్రావు పేర్కొన్నారు.
గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో జరిపిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏమి సాధించామో చెప్పకుండా ,
ఐఎన్టియుసి కార్యాచరణను, తమదిగా చెప్పుకుంటూ కాలం వెళ్ళేదీయడం వారి అనైతికతకు నిదర్శనమన్నారు.గనుల్లో, డిపార్ట్మెంట్లలో కార్మికులు, మహిళా కార్మికులు అధిక పనిభారంతో,మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కొరవడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏఐటీయూసీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో, పైరవీలకే పరిమితమవుతూ కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో కార్మికులు ఏఐటీయూసీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, నిజమైన కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్న ఐఎన్టియుసి పట్ల తమ మద్దతును కొనసాగించాలని జెట్టి శంకర్రావు పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో
సిహెచ్.భీమ్ రావ్, గరిగ స్వామి,కలవేన శ్యామ్, తిరుపతి రాజు,వెంకటేష్ పేరం రమేష్,ఏనుగు రవీందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి,ల్యాగల శ్రీనివాస్,జీవన్ జోయల్, మనోజ్,గోపాల్ రెడ్డి,చాట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.