BRS Condemns Action Against KTR
కేటీఆర్ పై కక్ష్య సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
#బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి
ములుగు, నేటిధాత్రి:
ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ అనుమతి తెలపడం తో కాంగ్రెస్ బీజేపీలు బిఆర్ఎస్ పార్టీ పై కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లామైంద బిఆర్ఎస్ ను కట్టడి చేయడానికి కేటీఆర్ ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి, బిజెపి కలిసి పనిచేస్తున్నాయి.
ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేఖత వచ్చినపుడు, ఎలక్షన్ లు వచ్చినపుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్ రెడ్డి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాడు.
రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్ పై విచారణ పేరుతొ కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారు.
ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్ష్యపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది.
అందులో భాగంగానే విచారణ పేరిట కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.
ఫార్ములా ఈ కార్ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిండు కేటీఆర్
అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకులను కట్టడి చేయగలం అనుకోవడం పొరపాటే
మీరెన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు అయ్యేవరకు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం.
కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది.
న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది..మీరు చేసే కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం
