అన్నదాతలకు అండగా ఉంటాం
-రైతుల పక్షాన పోరాటం చేస్తాం
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతు ఉంటమాని అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం దేవుని గుట్ట తండా లో ఎండిపోయిన పంట కాలువ, పంట పొలాలను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గత 15 రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీల్లు లేక అరిగోస పడుతున్నారని తెలిపారు. ఎండుతున్న వరిపోలాన్ని చూడలేక పశువులను మేతకు వదులుతున్న దుస్థితి నెలకొన్నదని అన్నారు. వెంటనే మిడ్ మేనేర్ నీటిని మల్కపేటకు పంపింగ్ చేసి రైతులను ఆడుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ , పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్ ,కొండ రమేష్ గౌడ్ ,నాయకులు నమిలికొండ శ్రీనివాస్, గూగులోత్ పెంటయ్య, అజ్మీర రాజు నాయక్,అజ్మీర తిరుపతి నాయక్, భూక్య ప్రభు, ధరావత్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.