
గ్రామాల్లో త్రాగునీటి సరఫరాను పరిశీలన
మిషన్ భగీరథ మల్లేశ్
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం లోని గంగిరెనిగుడెం, సూర్యనాయక్ తండా, అరేపల్లీ, కాట్రపల్లీ , రాజుపల్లీ గ్రామాల్లో మిషన్ భగీరథ అధికారులు శనివారము పర్యటించినారు. మండలంలోని అన్ని గ్రామాలకు నీటి ఎద్దడి లేకుండా వచ్చే ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అధికారులుపేర్కొన్నారు.మిషన్ భగీరథ ఎస్ ఈ మల్లేశ్ మాట్లాడుతూ రానున్న వేసవిలో గ్రామాల్లో ఎక్కడ తాగునీటిసమస్య రానీయ వద్దని ఆదేశించారు..పలు గ్రామాల కార్యదర్శులకు గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందించేవిదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చేతి పంపులను వాడకంలోకి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డి. ఇ.ఇ చంద్రు నాయక్, ఎంపిడిఓ ఎ.ఫణిచంద్ర , ఎ. ఇ. ఇ ఎన్.వెంకటేశ్ మరియు పంచయత్ కార్యదర్శులు పాల్గొన్నారు.