Negligence Turns Zaheerabad Into Filth Zone
మా తలరాత రోజు మురికి రోత అంటించుకోవాలి కొంత
◆:- ప్రతిరోజు ఇంతే కనబడదు పట్టించుకోలేని అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కోట్ల రూపాయలు పెట్టి మురికి కాల్వని నిర్మాణం చేసిన వాటి మీద అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ లేక నిర్లక్ష్యంగా వ్యవహరించి వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఆ మురికిని కొంచెం తమపై చిట్లించుకుంటున్న కూడా అధికారులు మాత్రం చూస్తూ వింతగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కావలసినంత పారిశుద్ధ్య కార్మికులు కార్మికులు ఉన్నప్పటికిని కొంతమంది దొరవారి దొడ్లకే పరిమితం అవుతున్నారు ప్రతిరోజు పురపాలక సంఘం అధికారులు కార్మికులకు హాజరు తీసుకుంటారు హాజరుకి అందరు వస్తారు కొద్దిసేపటికే కనుమరుగవుతారు అధికారులు ఇండ్లకు చేరుతారు తర్వాత అంతా కార్మికులు దొరల దొడ్లలో పనికి వెళ్తారు చిన్నపిల్లలను ఎత్తుకుంటారు వారి ముడ్లు కడుగుతుంటారు దొరల బట్టలు ఉతుకుతారు ఇల్లు వాకిళ్లు ఊడుస్తారు ఉద్యోగం పురపాలక సంఘం పని దొరలది ఇది జహీరాబాద్ పురపాలక సంఘం కార్మికుల దినచర్య అధికారుల నిర్లక్ష్యంతో ఏ మూల మలుపులో చూసిన విపరీతమైన చెత్త అది అక్కడే మురుగుతున్న పట్టించుకోరు వాటిని ఆసరా చేసుకొని ఊర కుక్కలు పందులు వీధి పశువులు కొండముచ్చులు విపరీతంగా పట్టణానికి వలస వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రజలపై ఎగబడి గాయపరుస్తున్నాయి ఆయన అధికారులకు పట్టింపు ఉండదు వాస్తవానికి ప్రజలకు చైతన్యం చేసే మార్గాలు అనేక ఉన్నప్పటికిని పట్టించుకునే పని లేదు రోజు ఎక్కడపడితే ప్రజలు చేత వేయాలి వేణు వెంటనే పురపాలక సంఘం కార్మికులు వీలైతే

తొలగించాలి లేకపోతే లేదు ఇది పరిస్థితి జహీరాబాద్ పురపాలక సంఘం దినచర్య నాయకులు ఎవరైనా ఏదైనా పని చెప్తే ఏదైనా సంస్కరణలు తీసుకురమ్మని చెప్తే నేరుగా వెళ్లి కార్మికులు ప్రజలతో పలాని నాయకుడు ఇలా చెప్తున్నాడు కొంచెం సక్రమంగా ఉండండి అని నాయకుల పేరు చెప్తారు తప్ప మీరు ఇలా చేయకూడదు ఇది చాలా తప్పు అధికారులు తప్పుపడుతున్నారు మీ పైన చర్యలు ఉంటాయని మాత్రం ఏ అధికారి చెప్పడు అధికారుల పూర్తిస్థాయి నిర్లక్ష్యంతో జహీరాబాద్ పట్టణమంతా మురికి తో మురికి కాలువలు నిండుకుండలాగా తయారై పొంగిపొర్లుతున్నాయి ఏ వీధిలో చూసినా విపరీతమైన దోమలు చిన్న పిల్లలు వృద్ధులు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా దోమల మందులు పిచికారి చేసేది లేనేలేదు కనీసం దోమలను పారద్రోలడానికి ఫాగింగ్ లాంటి పొగ చేసేది కూడా లేనేలేదు ప్రజలకు వ్యాధులు వస్తేనే మురికితో ముక్కుపూటలమురికితో ముక్కుపూటలు అదిరిపోతేనే అదిరిపోతేనే ఇవన్నీ మాకేం పట్టవు మాకు అడిగే వారెవరున్నారు పాలకవర్గం అయితే లేదు ప్రశ్నించినప్పుడు చూద్దాంలే ఇది జహీరాబాద్ పరిస్థితి
