ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలి

# నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిసిపి రవీందర్

నర్సంపేట,నేటిధాత్రి :

త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని వరంగల్ డిసిపి రవీందర్ తెలిపారు. శుక్రవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని నర్సంపేట ఏసిపి తిరుమల్, సిఐలు కిషన్, సుంకరి రవికుమార్ లతో కలిసి వరంగల్ డిసిపి పరిశీలించారు. ఈ సందర్భంగా దృష్టికి మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిధిలో నర్సంపేట వర్ధన్నపేట వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో ఎక్కువ పోలింగ్ శాతం జరగడం కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధి పోలీసులు అతి సమస్య ఆత్మకంగా ఉన్న ప్రాంతాలలో ఏసిపి సిఐ ఎస్ఐలతో ప్రత్యేక పర్యటనలు చేశామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి బెదిరింపులకు సంఘర్లకు పాల్పడ్డ రౌడీషీటర్లను క్షమించేదిలేదని డిసిపి హెచ్చరించారు.సమస్యలు తలెత్తే విధంగా అనుమానం ఉన్న వారిని, వివిధ రకాల వ్యక్తులను ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు. రాజకీయ పార్టీలు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సహకారంతో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ తోపాటు పారా మిలటరీ పోస్ట్ ను భద్రతగా ఏర్పాటు చేశామని ఫ్లయింగ్ స్పాట్స్ తో పరిశీలన చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు ఆరు కంపెనీల 4 వేల మంది ఆరు కంపెనీల బలాగాలు చేరుకున్నాయని ఎన్నికలకు పది రోజుల ముందు మరో ఇరవై ఒక్క కంపెనీల బలగాలు చేరుకొనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆలోచనయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు డిసిపి తెలిపారు. ఎన్నికల ప్రచారం నిర్వహించేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టి కొనసాగిస్తుందని తెలుపుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రచారం ముగించాలని డిసిపి రవీందర్ తెలిపారు. నర్సంపేట ఏసిపి తిరుమల్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో మూడు ఎస్ఎస్టి చెక్ పోస్టులు, ఒక జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు ఏర్పాటు చేయగా రెండు మండలాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు అందులో దుగ్గొండి నల్లబెల్లి మండలాలకు1, నర్సంపేట ఖానాపూర్ మండలాలకు ఒకటి చెన్నారావుపేట నెక్కొండ మండలాలకు ఒకటి మొత్తం మూడు ఏర్పాటు చేయగా, ఎంఎంసి కోడ్ అందులో మెజిస్ట్రేట్ లెవెల్ ఇన్చార్జితో పాటు పోలీస్ శాఖ ఉంటుందన్నారు. మొత్తం 283 పోలింగ్ కేంద్రాలు కాగా పోలింగ్ లొకేషన్ కేంద్రాలు 167 ఉండగా వాటిలో సమస్యాత్మక కేంద్రాలుగా 102 కేంద్రాలు గుర్తించామని అన్ని కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన భద్రత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా 35 రూట్లు ఏర్పాటు చేయగా ఒక్క రూట్ కు ఇంచార్జి ఉంటారన్నారు. వాటితోపాటు 31 సెక్టార్స్ లను ఏర్పాటు చేయగా దానికి ఒక్కో మెజిస్ట్రేట్ ఇన్చార్జి ఉంటారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 1365 మందిని వివిధ రూపాల్లో బైండోవర్ చేశామని మరికొందరిని గుర్తించనున్నట్లు ఏసిపి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!