@ టి.యు.డబ్ల్యూ.జె.ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షులు ఎండి. సాజిద్ పాష
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల అధ్యక్షులు మహమ్మద్ సాజిద్ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ బావర్చి హోటల్లో వరంగల్ ఈస్ట్ మైనార్టీ ముస్లిం జర్నలిస్టులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకు వచ్చాయి. అనంతరం టి.యు.డబ్ల్యూ.జె.ఎఫ్ అధ్యక్షులు సాజిద్ మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాల వల్ల పరస్పరం ఒకరికి ఒకరు సలహాలు సూచనలు చేసుకుంటూ ఐకమత్యంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.యు.డబ్ల్యూ.జె.ఎఫ్ జనరల్ సెక్రెటరీ ఏం ఏ. నయిం, ట్రెజరర్ మహమ్మద్ అమీర్, సలహాదారులు ఇస్మాయిల్ జాబి, ఉప అధ్యక్షులు మహమ్మద్ అక్రం, యండి మునవర్, జాయింట్ సెక్రెటరీ ఫిరోజ్ ఖాన్, రియాజుద్దీన్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఎండి నయీమ్ పాష, సీనియర్ జర్నలిస్టులు హుస్సేన్ పాషా, అక్తర్ హుస్సేన్, ఎండి మోయిన్, ఫతే ఉల్లా బేగ్, సాదిక్ హుస్సేన్, ఎండి అమీర్, సిరాజుద్దీన్, కార్యవర్గ సభ్యులు ఎండి ముబాషీర్, ఎండి బషీర్, ఎండి బాబర్, ఎండి మోమిన్, ఎండి మాజీద్, ఎండి ఫిరోజ్, ఖాదర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.