అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాలి…

అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాలి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) డివిజన్ కార్యాలయంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల హక్కులను పరిరక్షించాలని కోరారు.

రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామ్య సూత్రాలు, స్వాతంత్ర్య విధివిధానాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేయాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుడిపూడి అరుణా రామచంద్ర, బోనగాని రవీందర్, మహబూబ్ అలీ, సాయికుమార్, సాంబరాతి మల్లేశం, మహమ్మద్ సందాని, యాకూబ్ పాషా, బాబా యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version