
కౌకొండ పాఠశాలని కలెక్టర్ సందర్శించాలని కోరుతున్నాం
నడికూడ,నేటిధాత్రి:
ధర్మసమాజ్ పార్టీ నడికూడ మండల కమిటీ ఆధ్వర్యంలో స్టడీ టూర్ లో భాగంగా నడికూడ మండలం,కౌకొండ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలని సందర్శించి హెడ్మాస్టర్ సురేందర్ సార్ నుండి అనేక రకాల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు చుక్క రత్నాకర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉంది.ఈ పాఠశాలకు పెద్ద సమస్య ఏంటంటే సైన్స్ ల్యాబ్ కోసం శాశ్వత బిల్డింగ్ పనులు ప్రారంభించి ఆరు నెలలు అవుతుంది ఆ పనిని అర్ధాంతరంగా మధ్యలోనే ఆపివేశారు పిల్లర్స్ కోసం సలాకులు ఏర్పాటు చేశారు కానీ కాంక్రీట్ పోయకుండా వదిలేసేసరికి సలాకులు మొత్తం తుప్పు పట్టి బిల్డింగ్ స్థలంలో పిచ్చి మొక్కలు విపరీతంగా మొలిచి చాలా అధ్వానంగా ఉంది.దీనికి కాంట్రాక్టర్ భాస్కర్ నిర్లక్ష్యం వల్లనే ఈ బిల్డింగ్ పూర్తి కాక విద్యార్థులు సైన్స్ ల్యాబ్ కోసం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కాంట్రాక్టర్ స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని,డిమాండ్ చేస్తున్నాం.కలెక్టర్ పర్యవేక్షించాలని కోరుతున్నాం అదేవిధంగా పాఠశాలలో పి, ఈ, టి, టీచర్ ని నియమించాలని డిఈఓ ని డిమాండ్ చేస్తున్నాం.
అందులో భాగంగానే పాఠశాలలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాలని సందర్శించడం జరిగింది.4 వ అంగన్వాడి కేంద్రానికి శాశ్వత బిల్డింగ్ కోసం 2010 లో 13 లక్షల బడ్జెట్ తో సాంక్షన్ అయినా ఈ బిల్డింగ్ కి పిల్లర్స్,పై కప్పు వేసి దానిని పూర్తిగా నిర్మాణం చేయకుండా కాంట్రాక్టర్ భగవాన్ రెడ్డి నిర్లక్ష్యంతో అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.15 సంవత్సరాలుగా పిల్లలు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఆ కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మేకల ప్రవీణ్, ధర్మ స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి పూరెల్ల విష్ణు,గ్రామ అధ్యక్షులు ఇనుగాల దిలీప్, చుక్క సూర్యం,మేకల రాజేష్, పూరెల్ల ప్రశాంత్,బాలు, సిద్ధార్థ,తదితరులు పాల్గొన్నారు.