Protest Against Chemical Company in Malgi Village
మల్గి గ్రామంలో ఏర్పాటు చేసే కెమికల్ కంపెనీ నీ వ్యతిరేకిస్తునాం:నవోదయ సిద్దు
◆-: కంపెనీ ఏర్పాటు వద్దు
◆-: పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తుల స్పష్టమైన నిరసన
◆-: ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్‌కు వినతి పత్రం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో శనివారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్ధు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మల్గి గ్రామంలో కంపెనీ ఏర్పాటు చేయకూడదని కోరుతూ ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ నాయకులకు వినతి పత్రం అందజేశారు, ఆ తర్వాత సంస్థ సభ్యులు సంబంధిత న్యాల్కల్ మండలం రెవిన్యూ అధికారి ప్రభులు గారికి వినతి పత్రం ఇచ్చారు. గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాలు, వ్యవసాయం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
