
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నకార్మిక,రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, కార్మికులకు కనీస వేతనం 26000 వేలు ఇవ్వాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. సోమవారంచండూరు మండల కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4లేబర్ కోడ్ ల పత్రాలను దగ్ధం చేసి, నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.2014 నుండి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలో చాలా మార్పులు చేశారని,29 చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు.కనీస వేతనానికి గ్యారెంటీ లేకుండా ఎనిమిది గంటల పని విధానానికి బదులు 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్, నాన్ పర్మినెంట్ ఎంప్లాయిస్ అందరిని పర్మినెంట్ చేయాలని, రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్స్ లో కనీస వేతనాలు సవరించాలని ఆయన అన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ,బోనస్, గ్రాట్యూటి అమలు చేయాలని, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ వి ఓఏ లు, విద్య, వైద్యరంగం తో పాటు వివిధ స్కీములలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన అన్నారు. గడిచిన 10 ఏళ్లలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 28న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు, సెప్టెంబర్ 30న చలో లేబర్ కమిషనర్ రేట్ జరిగే ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మోగుదాల వెంకటేశం, సిఐటియు సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య,చండూర్ మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కత్తుల సైదులు యూనియన్ ఉపాధ్యక్షులునల్లగంటి లింగస్వామి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, పిట్టల చిన్న వెంకన్న, ఏ కాలపు అంజయ్య, బొమ్మర గొని సుమన్, బొమ్మరగొని అంజయ్య, బొమ్మర గోని గిరి, జే,కుమార్, పిట్టల అంజి,ధనయ,రమేష్,బి పంగి నాగరాజు, పెద్ద వెంకన్న, గండూరి వెంకన్న, బక్కమ్మ, చంద్రమ్మ, కలమ్మ, అలివేలు, ఎల్లమ్మ, రేణుక, లక్ష్మమ్మతదితరులు పాల్గొన్నారు.