రజతోత్సవ సభకు తరలిరావాలి.
సభను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..
“నేటిధాత్రి” హనుమకొండ.
ఈ నెల 27 న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు తరలి రావాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,అభిమానులకు,ప్రజలకు పిలుపునిచ్చారు.బుధవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్లలోని సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..
– మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
– అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసింది.
– నేడు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తిరిగలేని పరిస్థితుల్లో ఉన్నారు.
– 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు బయపడే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడంలేదు.
– స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ మరికొంత కాలం ఓపిగ్గా ఉండాలి.సమన్వయంతో ఉండాలి.
– కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలపాలి.
– పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతికార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది.
– ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరంలేదు.
– ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం..ప్రజలకు అండగా ఉంటాం.
– ఈ నెల 27న ఎల్కతుర్తి శివారులో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో నియోజకవర్గం నుండి తరలి వెళ్దాము.
– రేపటి నుండి ఆయా మండలాల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాలలోకి వెళ్లి సమావేశాలు నిర్వహించాలి.
– ఏ గ్రామం నుండి ఎంతమంది పార్టీ శ్రేణులు సభకు వస్తున్నారో,కావాల్సిన వాహనాలు ఎన్నో జాబితా సిద్ధం చేసి ఇవ్వాలి.

ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్యులు,మండల అదేకాశులు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.