Government & Private School
మా టీచర్లు మాకే కావాలి
• డిప్టెషన ను నిలిపివేయాలి
• గేటు ముందు గ్రామస్తుల నిరసన
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రభుత్వ పాఠశాలలను నమ్మి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తే డిప్టేషన్ పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 55 మంది విద్యార్థులకు గాను 4 టీచర్లు ఉండగా డిప్టేషన్పై ఇద్దరూ ఉపాధ్యాయులను వేరొక ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఇప్పుడు ఉపాధ్యాయులను తీసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థుల చదువులు నాశనం చేసినట్లు అవుతుందన్నారు. ఈ విషయమై నిరసిస్తూ గంటపాటు గేటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డిప్టేషన్ నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చూస్తామన్నారు. కార్యక్రమంలో బుర్ర సంతోష్ గౌడ్, అందే సిద్ధ రాములు, మ్యాదరి కుమార్, భూపతి రెడ్డి, బురాని నర్సాగౌడ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.
