మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి.
డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మహారాజ్.
చిట్యాల, నేటిధాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ వి శారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున పదివేల కార్లతో అదిలాబాదులో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్, జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్, చిట్యాల మండల అధ్యక్షులు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్, నవాబ్ పేట గ్రామ అధ్యక్షులు చిలుముల శశి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ మరియు బొడ్డు పాల్ చరణ్ పాల్గొన్నారు.