
Chairman Giridhar Reddy
పది సంవత్సరాలు పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ యువ నాయకులు అశ్విన్ పటేల్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న, జహీరాబాద్ నియోజకవర్గంలో వందకు వంద శాతం అన్ని గ్రామాలలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందుతమ్మనారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో, ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో, కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి, పాలించింది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు, మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు తీర్చాడని అన్నారు, పార్టీలో పదవులు లేకపోయినా అందరూ కలిసి మండలంలో పని చేస్తున్నాము. అధికారం ముఖ్యం కాదు, ప్రజల కోసం పని చేస్తున్నాము. పార్టీలో ఎవర్ని నిలబెట్టిన గెలిపించుకుంటాం. పని చేసుకుంటూ పోతే పదవులు అవే వస్తాయన్నారు. ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ జహీరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో, అత్యధిక శాతం స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం అని జహీరాబాద్ యువ నాయకులు అశ్విన్ పటేల్ సూచించారు.