SFI Demands Suspension of Teacher for Assault on Student
విద్యార్థి పై దాడిని ఖండిస్తున్నాం
ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్
దాడి చేసిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి
అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ ఆత్మకూరు గురుకులంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నివేదిత అనే విద్యార్థిని విచక్ష రహితంగా చెయ్యి విరిగేలా కొట్టిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మడికొండ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థి గ్రౌండ్లో గేమ్స్ ఆడుకున్న సమయంలో ఉపాధ్యాయురాలు చెప్పిన మాట వినకపోవడంతో విద్యార్థి నివేదతను విచక్షణ రహితంగా చేయి విరిగేలా కొట్టడం సరికాదన్నారు.విద్యార్థులకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి మంచి చెడు చెప్పవలసిన ఉపాధ్యాయులే ఇలా చేయడం సరికాదన్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం కూడా భోజనం పెట్టడం లేదన్నారు.పట్టణంలో ఉన్నటువంటి గురుకులాలలో రోజురోజుకు వింత ఘటనలు ఎదురవుతున్నాయని ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వెంటనే స్థానిక ఎమ్మెల్యే అధికారులు గురుకులన్నీ సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అలాగే విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురుకులం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
