ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల నగర పంచాయతీ మహిళ సఫాయి పారిశుద్ధ కార్మికురాలుగా వృత్తి నిర్వర్తిస్తున్న చుక్క కమలపై దాడి చేసిన పల్లెబోయిన శశి పల్లెబోయిన రేఖలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏకు శంకర్ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.ఊరిలోని చెత్త చెదారం కాలువలలోని కంపును శుభ్రం చేస్తూ ఉన్నతమైన సేవలందిస్తు ప్రాణాల్ని ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి వారి ఆరోగ్యాలను కూడా పట్టించుకోకుండా కోడి కూతకు ముందు లేసి రోడ్లు ఊడ్చి కాలువలు సాగు చేసి చెత్తాచెదాలను అంత తొలగించి వాడల్లో సువాసన వెదజల్లేలా సేవలందిస్తున్న మంచినీళ్లు అడగడానికి వెళ్లి గేటును తాకినందుకే మాదిగ మహిళ పారిశుద్ధ కార్మికురానిపై కులం పేరుతో దాడి బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ మరియు గ్రామపంచాయతీ సాఫ్ సఫాయి కార్మికుల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.