తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ఎండి.జాఫర్ రిజ్వి కాంగ్రెస్ సీనియర్ నాయకులు

పరకాల,నేటిధాత్రి

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ రిజ్వి జాఫర్ తీవ్రంగా ఖండించారు.ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దీర్ఘకాల ప్రజా ఉద్యమం,త్యాగాలు కారణమనిగుర్తుచేశారు.అలాంటి చారిత్రక ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని,అలాంటి సందర్భాల్లో మౌనం అనర్హమని పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని కాపాడే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని పేర్కొన్న ఆయన, బీజేపీ నాయకత్వం ఈ అంశంపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version