జి.జి.ఆర్ పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి:
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని జి.జి.ఆర్ పల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మక్కలు ఆరబోసిన రైతుల కల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల నాయకుడు, మాజీ సర్పంచ్ తుత్తురు రమేష్ మాట్లాడుతూ గతంలో కే.సీ.ఆర్ ప్రభుత్వం గురిజాల పి.ఎ.సి.ఎస్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు సహాయం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే గురిజాల సొసైటీ పరిధిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి మోటురి రవి, మాజీ ఎంపీటీసీ బండారి రమేష్, మండల నాయకులు కత్తుల కుమారస్వామి, అన్న రాజమల్లు, అల్లి రవి, వార్డు సభ్యుడు దగ్గుల లింగన్న, యాదవ సంఘం అధ్యక్షుడు తుత్తురు సాంబయ్య, మిట్టపల్లి రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రి కుమారస్వామి, పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ కత్తుల వెంకటేశ్వర్లు, శీలం కట్టయ్య, బానోత్ జై కుమార్, తుత్తురు గోపాల్, మూలం ఐలయ్య, పురాణి నర్సయ్య, కర్జల కుమారస్వామి, గాలి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
