బాట సరిగ్గా లేక బావులకు వెళ్లలేకపోతున్నాం

ఒర్రె(పెద్దకాలువ)దాటలంటే మహిళా కూలీల ఇబ్బందులు

గతంలో రైతులు సొంత ఖర్చులతో సిమెంట్ ఫోల్స్ ఏర్పాటు డబ్బులు లేక మధ్యలో నిలిపివేత

కల్వర్ట్ నిర్మించి పరిస్కారం చూపించండి-యువ రైతు నాగరాజు

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గతంలో ఒక కిలోమీటర్ వరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు అధిక వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి వర్షాకాలం వచ్చిన వర్షంపడిన రోడ్డు గుంతల మయంగా మారడంతో గుంతల్లో నీరు చేరి కాలినడకన భూముల వద్దకు వెళ్లే రైతులకు పెద్ద సమస్యగా మారింది.మందు పిచికారీ చేసుకోవాలన్నా,ఎరువులు పంట పొలాలదగ్గరకు తీసుకుపోవాలన్నా రైతులకు పెద్ద చిక్కెదురవుతుంది.

ఒర్రె(పెద్ద కాలువ)దాటలంటే ఇబ్బంది పడాల్సిందే

గ్రామంలోని మహిళా రైతు కూలీలు వ్యవసాయ బావులదగ్గరకు వెళ్లాలంటే మార్గం మధ్యలో ఒర్రె (పెద్దకాలువను) దాటుకొని వెళ్లాల్సివస్తుందని వర్షాకాలంలో ఎక్కువగా ప్రవాహం పెరిగి ఒర్రెను దాతలంటే దాదాపు బుజాలవరకు నీరు వస్తున్నదని గతంలో ఉన్న నాయకులకు చెప్పిన ఎవ్వరు పట్టించుకోలేదని మహిళా కూలీలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రైతులే సొంత ఖర్చుతో సిమెంట్ ఫోల్స్ ఏర్పాటు

వ్యవసాయ భూములు కలిగిన రైతులు భూముల దగ్గరికి వెళ్లే దారిలేక అందరు కలిసి తలకొన్ని డబ్బులు వేసుకొని సిమెంట్ ఫోల్స్ లను ఏర్పాటు చేసుకున్నామని డబ్బులు సరిపోక పని మధ్యలో ఆగిపోయిందని రైతులకు ఇబ్బంది అవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మార్గం చూపించాలని రైతులు కోరుతున్నారు.

గతంలో ఉన్న నాయకులు చెప్పిన పట్టించుకోలేదు

దారిలేక ఇబ్బంది పడుతున్నామని మా ఇబ్బందులు పట్టించుకోమని గతంలో ఉన్న పాలకులకు నాయకులకు చెప్పిన ఎవ్వరు పట్టించుకోలేదని ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని యువ రైతు అల్లం నాగరాజు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!