Vardhannapet BC Bandh Successfully Demands 42% Reservation
మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు
*తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ బంద్..
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…
*తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేశాము..
*బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది…
*రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..
*రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు…
*బీసీ బంద్ తో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాడం కోసమే బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాం..
*బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి…
_వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్దన్నపేట( నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో బిల్ ఆమోదించి గవర్నర్‌కి పంపినా,అది ఇంకా ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్న సందర్భంగా నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తోలుత స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీసీలకు మద్దతుగా షాపులను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం బీసీ నాయకులతో మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులతో మానవహారం చేపట్టి రోడ్డు పై బైఠాయించి మేమెంతో మాకు అంతా అంటూ నినాదాలు బీసీలకు మద్దతు గా నిలిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాము అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
