– రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని
– మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థలో ఉన్న మురికి కాలువల మరమ్మతులకు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తెలిపారు. మంగళవారం సిరిసిల్లలోని 5వ వార్డులో ఉన్న మురికి కాలువను మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రధాన మురికి కాలువలో ని షీల్ట్ చెత్త ద్వారా ఇళ్లలోకి మురికి నీరు చేరకుండా ప్రధాన మురికి కాలువలో చెత్తను తొలగించేలా అధికారులను ఆదేశించినట్లు చైర్ పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మున్సిపల్ అధికారులు ఉన్నారు.