
K.R. Nagaraju.
చర్చకు మేము సిద్ధం వేదిక ఎక్కడో చెప్పండని
*బి.ఆర్.ఎస్ నాయకుల దోపిడీని ప్రజలు అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు
*కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో కేవలం 20 మసాలా పాలనలో జరిగిన అభివృధి
*వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వంకటయ్య
వర్ధన్నపేట.(నేటిధాత్రి):
బి.ఆర్.ఎస్ నాయకుల దోపిడీని ప్రజలు అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. బిఆర్ ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో కేవలం 20 మసాలా పాలనలో జరిగిన అభివృధి మరియు ఎస్సీ, ఎస్టీల సంక్షేమము గురించి చర్చకు మేము సిద్ధం వేదిక ఎక్కడో చెప్పండని బిఆర్ ఎస్ నాయకులను వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ రాష్ట్ర నాయకులు నరుకుడు వంకటయ్య ప్రశ్నించారు.
బి.ఆర్.ఎస్ పాలనలో వర్ధన్నపేట నియోజక వర్గంలోఅప్పటి మీ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే తన కాంట్రాక్ట్ ను అభివృద్ధి చేసుకున్నాడే తప్ప ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించలేదు అని ప్రశ్నించారు.
ఆనాడు బి.ఆర్.ఎస్ నాయకులు మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ నుడి మొదలుకొని దళిత బంధు వరకు 30 % పర్సెంట్ కమిషన్ లు వసూళ్లు చేసుకున్నది నిజం కదా…? అని నీలాదిశారు. ఆనాడు మీ( బి.ఆర్.ఎస్) పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద ధర్నాలు చేసింది వాస్తవం కాదా? మీరు నాయకులు నలుగురికి దళిత బంధు ఇప్పించేది పోయి,మీరే దళిత బంధు తీసుకున్నారు,మీ కంటే పేదవాళ్ళు దళితులు లేరా.మీరా విమర్శించేది.
ఆనాడు బి.ఆర్.ఎస్ నాయకులు గ్రామపంచాయతీల నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు సెటిల్ మెంట్లన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలలో జరిగినట్లు అనేక సందర్భాల్లో కూడా పత్రికలో వచ్చినవి మర్చిపోయారా .
మేము ఏ రోజు కూడా మార్కెట్ యార్డులో ప్రెస్ మిట్లు పెట్టలేదు దీని పై కూడా బహిరంగ చర్చకు మేము సిద్ధం అందుకు బారాస నాయకులు సిద్ధమా అని నీలదిశారు
మేము పెట్టిన ప్రెస్ మీట్స్ అన్నియు కూడా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వాటి వాస్తవాలు తెలియ పర్చడం కోసం ప్రెస్ మీట్స్ ఇచ్చినాము.
రాజకీయాలు అనుభవం అని చెప్పుకుంటున్న మీకు కనీసం మేము ఇచ్చిన ప్రెస్ మీట్స్ మార్కెట్ యార్డ్, క్యాంప్ కార్యాలయమా తెలుసుకోలేక పోయారంటే అధికారం లేదు అనే దేరుద్దేశం తప్ప వేరే కాదని ఈ నియోజకవర్గ ప్రజలకు అర్థమవుతుంది.
అయినా ఎవ్వరూ ఎన్ని అవాక్కులు, చేవాక్కులు పెలిన ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల కోసం పోరాడుతుంది.
మా నాయకుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు నిత్యం ప్రజా క్షేత్రములో ఉంటూ ప్రజలతో మామేకమవుతూ ప్రజల యోగక్షేమలు తెలుసుకుంటూ నియోజక అభవృద్ధి కోసం పరితపిస్తూ అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న తిరును చూసి బిఆర్ ఎస్ నాయకులకు మింగుడు పడక ఓర్వలేని తనముతో కాంగ్రెస్ పార్టీ నాయకుల పై అక్కసును వెళ్ళగక్కుతున్నారు.బిఆర్ ఎస్ నాయకుల తిరును నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. బిఆర్ ఎస్ నాయకులర్రా తస్మా జాగ్రత్త అని హెచ్చరించారు.