చాలి చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం

– అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యొక్క సమస్యలను పరిష్కరించండి
– రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
“మే” డే సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లాకి విచ్చేసిన బీసీ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి , కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ ని మర్యాద పూర్వకంగా కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మహిళ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యొక్క సమస్యల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ గత బి.ఆ.ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది కుటుంబాల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ లను వెట్టి చాకిరి చేయించి వారికి చాలి చాలని జీతాలతో మరియు ఉద్యోగ భద్రత లేక వారి కుటుంబాలు రోడ్డున పడడానికి కారణమయ్యేలా కేసిఆర్ ప్రభుత్వం పని చేశారనీ అన్నారు. దీని వలన వారంతా కేసీఆర్ ప్రభుత్వం పైన విసుగు చెంది కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారంతా కృషి చేసారన్నారు. వారి ప్రధాన సమస్యలైన వాటిలో 60 సంవత్సరాలు నిండిన వారి రిటైర్మెంట్ మెంట్ విషయంలో వారికి న్యాయం చేయాలని, వారికి వేసవి సెలవులు కల్పించాలని, వారికి నెలనెలా 1 తేదీన జీతాలు చెల్లించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి విన్నవించడం జరిగిందన్నారు. ఇట్టి సమస్యల పైన వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెంటనే చరవాణి లో మాట్లాడించడం జరిగిందన్నారు. అలాగే త్వరలో సీతక్కని సిరిసిల్లా కి రావాలని కోరుతూ చెప్పడం జరిగిందన్నారు. అందుకు సీతక్క త్వరలో వారి సమస్యలు అన్ని తీరుస్తామని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి, అంగన్వాడీ లను నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన తో పట్టణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సానియా, 21 వ వార్డు అధ్యక్షురాలు గోనె శరణ్య, కార్యదర్శి ఎదురుగట్ల వనిత, 22 వ వార్డు అధ్యక్షురాలు రోజా, పట్టణ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్ , నాయకులు రెబ్బ శ్రీను, రమేష్, అల్లం సాయి, రఫీక్ , ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!