‘ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం’
‘నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే.
దేవరకద్ర / నేటి దాత్రి.
దేవరకద్ర నియోజకవర్గం మండలం గోవిందహళ్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూ.. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు.
ఒక్క గోవిందహళ్లి గ్రామంలోనే రైతులకు రూ.58,75, 312 రుణమాఫీ చేశామన్నారు. 100 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 102 కుటుంబాలకు 500 లకే సబ్సిడీ సిలిండర్, 35 మంది కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం, త్వరలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన 2 రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ హామీలు నెరవేర్చామన్నారు.

దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా రైతులకు ఏక కాలంలో రూ.21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ. 500 బోనస్ రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. గత ప్రభుత్వం గోవిందహళ్లి గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.